పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఆమె... అతడైతే’
ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియచేశారు.
చిత్ర దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ... ‘‘విలేజ్ నుండి ఓ కుర్రాడు తన లక్ష్యం కోసం సిటీకి వచ్చి, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించుకున్నాడు అనే కథాంశంతో ఫుల్‌లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ‘ఆమె.. అతడైతే’ డిఫరెంట్ టైటిల్. కథకి యాప్ట్ అవడంతో పెట్టడం జరిగింది. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు సంపాదించుకున్న హనీష్ హీరోగా నటిస్తున్నారు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది’’ అన్నారు.
నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ... ‘‘డైరెక్టర్ సూర్యనారాయణ చెప్పిన పాయింట్ చాలా ఇంప్రెసివ్‌గా వుండడంతో కథ నచ్చి ఇమీడియట్‌గా జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ నెలలోనే ఆడియోను రిలీజ్ చేసి నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రం రెడీ అవుతోంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మా చిత్రం కూడా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.
భానుచందర్, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాతలు: ఎం. మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: కె.సూర్యనారాయణ.











