Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Nani’s Next Titled Gentleman

$
0
0

నాని- మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి చిత్రం
`జెంటిల్‌మ‌న్‌`

first look

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రానికి జెంటిల్‌మ‌న్‌ అనే పేరు పెట్టారు.   'ఆదిత్య 369', 'వంశానికొక్కడు'  వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ  చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ   మా సంస్థ‌లో నాని హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా సినిమాకు `జెంటిల్‌మ‌న్` అనే పేరును ఖరారు చేశాం. ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే అంశాలుంటాయి. ఆహ్లాద‌క‌ర‌మైన‌ రొమాన్స్, సెంటిమెంట్, వినోదం త‌గిన మోతాదులో క‌ల‌గ‌లిసి ఉంటాయి. చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే  పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌ణిశ‌ర్మ మంచి సంగీతాన్నిచ్చారు. పాట‌ల విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Nani's Next Titled Gentleman

Nani’s Next Titled Gentleman

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>