సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే మూడు భాషల్లో ఉండిపోరాదే చిత్రం నిర్మించా - నిర్మాత డా.లింగేశ్వర్

I made Undiporaadey movie in 3 languages because of confidence in the movie: Producer Dr.Lingeswaarr (Photo:SocialNews.XYZ)
ఉండిపోరాదే
. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తండ్రి గొప్పతనాన్ని తెలియజేసే పాటను విడుదల చేశారు. ప్రముఖ గాయని చిత్ర ఈ పాటను పాడగా.... ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. సాబూ వర్గీస్ సంగీతం అందించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అన్నికార్యక్రమాలు పూర్తిచేసి జులై నెలాఖరుకి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా
ఈ సందర్బంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. కూతురు తండ్రి కొసం పాడే ఈ సాంగ్ ని సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించడం చిత్ర గారు పాడటం ఈ సాంగ్ హైలెట్స్ అని చెప్పాలి. చాలా చక్కటి విలువున్న సాంగ్ .. ఆడపిల్ల ని తక్కువుగా చూడకూడదు.. ఆడపిల్ల పుట్టుక చాలా అవసరం అని తెలియజేప్పే ఈ సాంగ్ వలన కొంత మందైనా మారాలి అని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించిన డా.లింగేశ్వరావు గారు , దర్శకుడు నవీన్ నాయని గారికి నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అని అన్నాడు.
తండ్రి పాత్ర లో నటించిన కేదార్ శంకర్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం లో నటించినందుకు చాలా ఆనందంగా వున్నాను. నిర్మాత లింగేశ్వర్ గారు దర్శకుడు నవీన్ గారు చాలా క్లారిటి తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పడు విన్న ఈ సాంగ్ చాలా బాగుంది. అన్నారు.
సంగీత దర్శకుడు సబు వర్గీస్ మాట్లాడుతూ...``ఇందులో ప్రతి పాట సందర్భానుసారంగా సాగేదే. దర్శక నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మంచి పాటలు ఇవ్వగలిగాను. ఈరోజు విడుదల చేసిన పాటకు చిత్ర గారు ప్రాణం పోశారు. సుద్దాల గారు మంచి సాహిత్యం అందించారు. మా డైరెక్టర్ కు మా నిర్మాతకు చాలా చాలా థాంక్స్ అని అన్నారు.
మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం మాట్లాడుతూ...``మా నిర్మాత లింగేశ్వర్ గారు ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఒక మంచి లైన్ చెప్పారు. దాన్ని నేను, డైరక్టర్ కలిసి డెవలప్ చేసాం. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మాటలు కూడా చాలా సహజంగా కుదిరాయి. ఈ సినిమాతో అందరికీ మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇప్పడు ఈ సాంగ్ విన్న వారందరికి ఈ సినిమా అర్దమవుతుంది. మా నిర్మాత గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుతున్నాను.. అని అన్నారు
దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ...నన్ను నమ్మి డైరక్టర్ గా అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఇదొక రియలిస్టిక్ స్టోరి. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ గా, మనసులు కదిలించే సాంగ్ ఇది. ఇటీవలే కన్నడ లో మా ఆడియో విడుదలయ్యింది. కేదార్ శంకర్, అజయ్ ఘోష్ ల పాత్రలు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. హీరో హీరోయిన్ చాలా సహజంగా నటించారు. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా
అన్నారు.
నిర్మాత డా.లింగేశ్వర్ మాట్లాడుతూ...నేను విడుదలయ్యే ప్రతి సినిమా చూస్తూ దాని గురించి అనాలసిస్ చేసేవాణ్ని. ఇక నేనే సినిమా చేస్తున్నప్పుడు ఎంత కేర్ తీసుకుంటానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆడియో విషయం లో చాలా జాగ్రత్త తీసుకున్నాం. సబు వర్గీస్ మంచి పాటలు ఇచ్చారు. ఇటీవలే కన్నడ లో కూడా ఆడియో ని విడుల చేశాము. ఇంత వరకు తెర పై రానటువంటి కథ ఇది. మా సినిమాకు, సుద్దాల అశోక్ తేజ గారు నాన్న పై రాసిన పాటకు అవార్డ్స్ వస్తాయనడంలో సందేహం లేదు. ప్రతి తల్లీదండ్రితో పాటు పిల్లలందరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే సినిమా. మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువలు, బాంధవ్యాలు చూపిస్తూనే కమర్షియల్ హంగులు జోడించాం. కథ మీద ఎంతో నమ్మకంతో వున్నాను కాబట్టే మూడు భాషల్లో నిర్మిస్తున్నాను.
అన్నారు.
హీరో తరుణ్ తేజ్ మాట్లాడుతూ... సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మూడు నాలుగు సినిమాలు చేసిన దర్శకుడిలా మా డైరెక్టర్ వర్క్ ఉంటుంది. నిర్మాత లింగేశ్వర్ గారు మంచి ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది. అని అన్నారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.... నా ఫస్ట్ సినిమా ఇది. చాలా మంచి పాత్ర ఇచ్చారు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ నవీన్ చాలా క్లారిటీ తో వున్నారు. నిర్మాత లింగేశ్వర్ గారికి ఈ సినిమా బాగా అడుతుందనే నమ్మకంతో మూడు భాషల్లో రూపొందించారు. మమ్మల్ని ఆశీర్వదించండి. అని అన్నారు.
తరుణ్ తేజ్, లావణ్య, సిద్ధిక్ష, అజయ్ ఘోష్, సీనియర్ సూర్య, సుజాత, రూపిక, సత్య కృష్ణ, కేదార్ శంకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః శ్రీను విన్నకోట; స్టంట్స్ః రామ్ సుంకర; సంగీతంః సబు వర్గీస్; లిరిక్స్ః సుద్దాల అశోక్ తేజ, డా.లింగేశ్వర్, వనమాలి, రామాంజనేయులు; పి ఆర్ ఓ .. ఏలూరు శ్రీను, కొరియోగ్రాఫర్ః నరేష్ ఆనంద్; నిర్మాతః డా.లింగేశ్వర్; దర్శకత్వంః నవీన్ నాయని.
The post I made Undiporaadey movie in 3 languages because of confidence in the movie: Producer Dr.Lingeswaarr appeared first on Social News XYZ.