మధు సాయి వంశీ, శ్రావణి నిక్కీ, హిమబింధు నటీనటులుగా ‘అర్జునవేట’ చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో మొదలైంది. కె.రవీంద్ర కల్యాణ్ దర్శకత్వంలో రోజా శ్రీనివాస్ సినిమాస్ పతాకంపై వాయల శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు.
అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ యదార్థ సంఘటన ఆధారంగా రైస్ పుల్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అని తెలిపారు. ‘‘వచ్చే నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాం. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. సుబ్బరాజు, వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: డి. ఇమామ్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి.
The post Arjun Veta Movie Launched appeared first on Social News XYZ.