Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

Maharshi will be a landmark movie: Dil Raju

$
0
0

`మహర్షి` ఓ ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది - దిల్ రాజు

Maharshi will be a landmark movie: Dil Raju

Maharshi will be a landmark movie: Dil Raju (Photo:SocialNews.XYZ)

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఉగాది కానుకగా శనివారం విడుదల చేశారు. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ స్టైలిష్‌ క్లాస్‌ లుక్‌తో కనిపిస్తూనే.. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో మాస్‌ ఆడియన్స్‌ని కూడా అలరించే విధంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు... కామాస్‌ మాత్రమే ఉంటాయి', 'సక్సెస్‌ నాట్‌ ఎ డెస్టినేషన్‌. సక్సెస్‌ ఈజ్‌ ఎ జర్నీ', 'నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌.. ఎవరైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు' అంటూ సూపర్‌స్టార్‌ మహేష్‌ చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా రిచ్‌గా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ 'ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి యాదే..'కి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ని సాధించి ట్రెండ్ క్రియేట్ చేస్తుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
దిల్‌రాజు మాట్లాడుతూ ''మహర్షి సినిమాకు సంబంధించి చోటి చోటి బాతే.. సాంగ్‌ రిలీజ్‌ చేసినప్పుడు ఇదేదో ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన మూవీ అనుకున్నారు. అయితే ఈరోజు టీజర్‌ చూడగానే అందరి అభిప్రాయాలు మారాయనుకుంటున్నాను. టీజర్‌ ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది. రేపు అన్నీ పాటలు, ట్రైలర్‌ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటారు. మే 9న సినిమా విడుదలవుతుంది. మే 9న అశ్వినీదత్‌గారి బ్యానర్‌ నుండి జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు వస్తే.. మా బ్యానర్‌ నుండి ఆర్య, పరుగు చిత్రాలు వచ్చాయి. మాతో పాటు పివిపిగారు కూడా కలిసి నిర్మిస్తోన్న చిత్రమిది. వంశీ ఊపిరితో కలిపి 5 సినిమాలు చేస్తే అందులో నాతోనే 4 సినిమాలు చేశాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ గురించి ఆలోచించి రేపు విడుదల వరకు చూస్తే వంశీ ఈ సినిమా కోసం మూడేళ్లుగా కష్టపడుతున్నాడు. రేపు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. తెలుగులో కంటెంట్‌ వైజ్‌గా కానీ.. మేకింగ్‌ వైజ్‌గా తెలుగులో అద్భుతమైన సినిమా. వంశీ కథ చెప్పగానే అశ్వినీదత్‌, పివిపిగారితో జాయినై చేసిన సినిమా. మా నమ్మకం, టీం పడ్డ కష్టం మే 9న ప్రేక్షకులు చూస్తారు'' అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఫీలర్‌, టీజర్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మే 9న వస్తోన్న సినిమాపై టీం అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా జర్నీ విషయంలో నిర్మాతలు అందించిన సహకారానికి థాంక్స్‌. ఎందుకంటే నేను అడిగిన దాన్ని ఏదీ కాదనకుండా అందించారు. కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన బాధ్యత నాదే అవుతుంది. వాళ్లు కథను నమ్మి ఏం చేయవచ్చు అని ఆలోచించే నిర్మాతలు దొరికడం హ్యాపీ. ఇక మహేష్‌గారి గురించి చెప్పాలంటే.. అందరూ ఆయన్ని డైరెక్టర్స్‌ యాక్టర్‌ అని అంటుంటారు. రిషి అనే క్యారెక్టర్‌కు ఆయన ఊపిరి పోశారు. ఆయన నమ్మకం, సపోర్ట్‌ కారణంగానే ఇంత మంచి సినిమా చేయగలిగాం. హరీష్‌ సాల్మన్‌గారికి, మోహనన్‌గారికి థాంక్స్‌. దేవి ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ అందించాడు. ఎడిటర్‌ ప్రవీణ్‌గారికి, రామ్‌ లక్ష్మణ్‌, శ్రీమణి ఇలా అందరికీ థాంక్స్‌. అందరి సపోర్ట్‌ ఉంటేనే ఇలాంటి ప్రొడక్ట్‌ బయటకు వస్తుంది. ఒక పాట తీస్తున్నాం. మరో పాట బ్యాలెన్స్‌ ఉంది. ఆల్‌ రెడీ ఫస్టాఫ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పూర్తయ్యింది. ప్రతి జీవితానికి ఓ జర్నీ ఉంటుంది. దాన్నే నేను నమ్మి రిషి అనే క్యారెక్టర్‌ జర్నీని చూపిస్తున్నాం. ఇందులో మీ జీవితం, మీ పక్కవాళ్ల జీవితం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. రేపు సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్‌షిప్‌, లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్నింటికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. మహేష్‌లాంటి స్టార్‌ హీరో ఉన్నప్పుడు కథను చెప్పాలనుకుంటున్న స్టయిల్లో చెబుతూ ఆయన సూపర్‌స్టార్‌ డమ్‌ను పక్కన పెట్టకుండా చేయాలి కాబట్టి.. కాస్త సమయం పట్టింది. 'ఊపిరి' సినిమా సమయంలో మహేష్‌గారికి లైన్‌ చెప్పాను. తర్వాత 6 నెలలకు కథ చెప్పాను. ఈ కథను చెప్పే సమయంలో ఆయనకిది 25వ సినిమా అని తెలియదు. అలా కుదిరింది. మహేష్‌గారి కెరీర్‌లో అయినా, మా అందరి కెరీర్స్‌లోనూ ఇది ల్యాండ్‌ మార్క్‌ మూవీ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరి కథ. మహేష్‌గారి సినిమా అంటే ఓ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే సినిమాను చేయాలి. రేపు సినిమాను చూస్తే సినిమా ఎలా ఉందో మీరే చెబుతారు. ఆయన కాలేజ్‌ కుర్రాడిలా నటించారు. ఆయన కొత్తలుక్‌లో కనిపిస్తారని మీకు అనిపించొచ్చు. కానీ ఆయన దాన్ని ఎలా తీసుకున్నారు. దాని కోసం ఎలా చేంజ్‌ అయ్యారనేది మాకు తెలుసు. రేపు సినిమా చూస్తే ఆయన సినిమాలోని వేరియేషన్స్‌ను క్యారీ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ అవుట్‌ పుట్‌ విని టీం అందం థ్రిల్‌ ఫీలయ్యాం. నరేష్‌గారు అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయనపై కామెడీ అనే ముద్ర పడిపోయింది. ఈ సినిమాకు సంబంధించిఈ సినిమాలో అయన చాలా మంచి పాత్ర చేశారు. పాత్ర ఎవరు చేస్తే బావుంటుందని అనుకున్నప్పుడు నరేష్‌గారైతే బావుంటుదనిపించింది. అది యూనిట్‌కు చెప్పగానే వాళ్లు అవును బావుంటుందని అన్నారు. ఈ క్యారెక్టర్‌ను చేసిన నరేష్‌గారికి.. అలాగే పూజా క్యారెక్టర్‌ చేసిన పూజా హెగ్డేకు థాంక్స్‌. దిల్‌రాజుగారితో సినిమాలు చేస్తూనే ఉంటాను. ఆయనతో ఎప్పటి నుండో అనుబంధం ఉంది. ఆయన్ని మా ఫ్యామిలీ మెంబర్‌లా ఫీల్‌ అవుతాను. మహేష్‌గారితో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. బయట ఎంత ఇమేజ్‌ ఉన్నా కూడా ఆయన సెట్‌లో నార్మల్‌గా ఉంటారు. అద్భుతమైన సపోర్ట్‌ అందించారు'' అన్నారు.

The post Maharshi will be a landmark movie: Dil Raju appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>