మే 1న నిఖిల్ `అర్జున్ సురవరం`


నిఖిల్ సిద్దార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్‌ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''అర్జున్ సురవరం''. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 1న విడుదల చేస్తున్నారు. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు అభినందనలు తెలియజేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ ''మా చిత్రం 'అర్జున్ సురవరం' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. మీడియా పవరేంటో తెలియజేసే చిత్రం ఇది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. హీరో నిఖిల్‌గారు ఛాలెంజింగ్‌గా ఫీలై, చాలా కేర్ తీసుకుని చేసిన చిత్రమిది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. టాప్ టెక్నీ షియన్స్ అంతా ఈ సినిమాకి వర్క్ చేశారు. చాలా ఎగ్జయిటెడ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది'' అన్నారు.
నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు..
సాంకేతిన నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: టిఎన్ సంతోష్
సమర్పకుడు: బి మధు
నిర్మాతలు: కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్
నిర్మాణ సంస్థలు: ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్రఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
క్యాస్ట్యూమ్ డిజైనర్: రాగా రెడ్డి
డైరెక్షన్ డిపార్ట్ మెంట్: రమా రమేష్, రంగనాథ్, లోకేష్, భరత్, అరు, బ్రహ్మ
పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను
పిఆర్ఓ: వంశీ శేఖర్
The post Nikhil’s Arjun Suravaram movie to release on May 1st appeared first on Social News XYZ.