Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Maharshi Teaser On April 6th New Poster

$
0
0

ఉగాది కానుకగా ఏప్రిల్‌ 6న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'మహర్షి' టీజర్‌ విడుదల

Maharshi Teaser On April 6th New Poster

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ 'ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే..'కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఏప్రిల్‌ 6 ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్‌ ఎకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

The post Maharshi Teaser On April 6th New Poster appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles