Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Sri Kala Sudha Telugu Film Awards for year 2019 announced

$
0
0

Sri Kala Sudha Telugu Film Awards for year 2019 announced

Sri Kala Sudha Telugu Film Awards for year 2019 announced (Photo:SocialNews.XYZ)

గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సినిమా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్బంగా 21 వ ఉగాది పురస్కారాలు పేరుతొ అవార్డులు అందించనున్నారు. ఈ సందర్బంగా కర్టైన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో గురువారం జరిగింది. ప్రముఖ సీనియర్ దర్శకులు సాగర్ ఉగాది పురస్కారాల బ్రోచర్ ని విడుదల చేసి నిర్మాత మోహన్ వడ్లపట్ల కు అందచేశారు.

ఈ కార్యక్రమంలో కళాసుధ ప్రసిడెంట్ బేతిరెడ్డి శ్రీనివాస్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ .. గత 20 సంవత్సరాలుగా కళాసుధ పేరుతొ సినిమా అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. నిజంగా ఇలాంటి మంచి పని చేస్తున్న శ్రీనివాస్ ని ఈ కమిటీని అభినందిస్తున్నాను. అన్ని పనులు డబ్బుకోసం చేయరు. కొన్ని పనులు సంతృప్తి కి కోసం చేస్తారు, ఇది అలాంటిదే. ఈ ఏడాది అవార్డులు అందుకుంటున్న వారిని అభినందిస్తున్నాను. చెన్నై లో తెలుగు వాళ్ళ సత్తా చాటేలా ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను అన్నారు.

నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ .. నేను కూడా పదేళ్ల క్రితం కలవరమాయే మదిలో సినిమాకు గాను ఈ అవార్డును అందుకున్నాను. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెన్నై లో ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సారి సినిమా తారలందరూ పాల్గొని కార్యక్రాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు.

బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ .. గత ఇరవై ఏళ్లుగా కళాసుధ పేరుతొ ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది సందర్బంగా సినిమా తరాలకు అవార్డులతో సత్కరిస్తున్నాం. సినిమా వాళ్ళ ప్రోత్సహం కూడా ఎంతో ఉంది. ఈ ఎప్పటిలాగే ఈ ఏడాది చెన్నై లోని మ్యూజిక్ అకాడమీ లో ఈ వేడుక జరుగుతుంది . అందరు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఉగాది అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారాలు కూడా అందచేస్తారు.

The post Sri Kala Sudha Telugu Film Awards for year 2019 announced appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>