డిసెంబర్ 26న గ్రాండ్ గా విడుదలవుతున్న మంచి సందేశాత్మక చిత్రం 'అక్షరం'!!
పిఎల్ క్రియేషన్స్ బ్యానర్ పై నటుడు లోహిత్ కుమార్ నిర్మాతగా జాకీ తోట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అక్షరం`. శివాజి రాజా, జాకీ, గుండు సుదర్శన్, సివి ఎల్ నరసింహరావు, భావన ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి ద్వారా గ్రాండ్ గా విడుదలవుతుంది...
ఈ సందర్భంగా.. నిర్మాత లోహిత్ కుమార్ మాట్లాడుతూ.. 'అక్షరం' అందరిదీ. అన్నీ ఉచితంగా అందరికీ ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించే సినిమా ఇది. మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే సినిమా. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే సినిమా ఇది. ఒకరకంగా సమాజహితమైన సినిమా 'అక్షరం'. దేశం సర్వనాశనం కావాలంటే అణుబాంబులు, యుద్ధాలు చేయనక్కర్లేదు. విద్యా వ్యవస్థ మీద దెబ్బకొడితే చాలు. ఆ దేశం నిర్వీర్యమౌతుంది అన్నది అందరికీ తెల్సిన అంశమే. నేడు మనం చదువు కోవడం లేదు. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించి అసలు పిల్లలు ఏమవ్వాలి? ఎలా అవ్వాలి? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనేది కూడా వారు మరిచిన క్షణాలివి. అందుకే దానివల్ల స్వార్ధం, క్రూరత్వమే పెరుగుతుంది తప్ప మంచి అభివృద్ధి అనేది, మంచి అనేది రాదు. ఈరోజు సమాజంలో జరిగే ప్రతి అకృత్యానికి వారికి వారి అజ్ఞానమే కారణం. అందుకే 'అక్షరం' ప్రతి ఒక్కరూ అందుకోవాలనుకునే సినిమా" అన్నారు.
శివాజిరాజా, లోహిత్ కుమార్, జాకీ, గుండు సుదర్శన్, సిబిఎల్ నరసింహరావు, భావన, జయలక్ష్మి, మేఘనా చౌదరి, చక్రి, తరున్ బర్మ, నికిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి..
రచన, దర్శకత్వం: జాకీ తోట,
నిర్మాత: లోహిత్ కుమార్,
సినిమాటోగ్రఫీ: కూనపరెడ్డి జైకృష్ణ,
సంగీతం: శశి ప్రీతమ్,
మాటలు: ఆదిత్య భార్గవ్,
పిఆర్ఓ: సాయి సతీష్ పాలకుర్తి.





The post Aksharam Will Be Released On The 26th Of December appeared first on Social News XYZ.