Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94744

Aadi Saikumar’s 16th Film Launched

$
0
0

హీరో ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం !!!

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు కథ ఇవ్వడం జరిగింది. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆది సాయి కుమార్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. ఆది సాయికుమార్ చేసిన గత సినిమాల కంటే ఈ సినిమాలో భిన్నంగా ఉంటుందని తెలిపారు. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన ఈ చిత్రం షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేసి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమము నిర్మించబోతున్నట్లు నిర్మాత మహంకాళి దివాకర్ తెలిపారు. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రానికి
నిర్మాత: మహంకాళి దివాకర్, నిర్మాణ నిర్వాహణ : శంకర్,
రచనా దర్శకత్వం: జీ.బి.కృష్ణ.

Aadi Saikumar's 16th Film Launched Aadi Saikumar's 16th Film Launched

The post Aadi Saikumar’s 16th Film Launched appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94744

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>