సురేష్ బాబు కు షాక్ ఇవ్వనున్న దర్శకుడు ?
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి 'వెంకీ మామ' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ర్ సినిమా షూటింగ్ నిజానికి ఇప్పటికే మొదలవ్వాలి. కానీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. ప్రతినెలా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అభిమానులు ఈ మూవీ గురించి వెయిట్ చెయ్యలేక పోతున్నారు.
వవంబర్ లొనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ పలుసారి వాయిదా పడుతూనే ఉంది. దానికి కారణం నిర్మాత సురేష్ బాబు అని తెలుస్తోంది. నిర్మాత సురేష్ బాబుకు బాబీ చెప్పిన పాయింట్ నచ్చడం లేదని అందుచేత సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదని సమాచారం. బాబీ నిర్మాత సురేష్ బాబు చెప్పే మార్పులకు తల పట్టుకుంటున్నదని, ఆయన ఈ సినిమా నుండి బయటికి వచ్చేయ్యాలని భవిస్తున్నట్లు సమాచారం.
గతంలో తేజ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఇలానే స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అలానే ఈ సినిమా కూడా జరుగుతోంది. సురేష్ బాబు ఏ కథను అంత సులభంగా ఒప్పుకోడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ బాబు ఏం చెబుతాడో చూడాలి. వెంకీ నటించిన ఎఫ్ 2 విడుదలకు సిద్దంగా ఉంది. చైతూ సమంతతో ఒక సినిమా చేస్తున్నాడు.
The post Director Bobby to walkout of Venky Mamma? appeared first on Social News XYZ.