ప్రభాస్ సినిమాకు చిరు పోటీగా వస్తాడా ?
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సాహో సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆగష్టు లో ఈ సినిమా విడుదల కానుందని అభిమానులు ఊహించిన విధంగానే జరిగింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యు.వి.క్రియెషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి సినిమా కూడా ఆగష్టు లో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు సాహో సినిమాకు పోటీగా ఆదేరోజు ప్రేక్షకుల ముందుకు రానుందని న్యూస్ నినిపిస్తోంది. దీని గురించి నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
బాబూబలి సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను వినూత్న స్థాయిలో పెంచేసుకున్న ప్రభాస్ అభిమానులు సాహో సినిమా కోసం చాలా వెయిట్చేస్తున్నారు. అదే విధంగా చిరు సైరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విసుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
The post Will Sye Raa compete with Saaho? appeared first on Social News XYZ.