బన్నీ మరో సినిమా చెయ్యబోతున్నాడా?
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. మొదట ఒక బాలివుడ్ సినిమాను రీమేక్ చెయ్యాలని భావించినా చివరికి స్ట్రెయిట్ కథతో సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాతో పాటు బన్నీ దర్శకుడు మారుతితో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మారుతి చెప్పిన కథలో కొన్ని మార్పులు చెప్పాడట బన్నీ, త్వరలో మారుతి, బన్నీ సినిమా కూడా ఉంటుందని తెలుస్తోంది. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అల్లు అర్జున్ వరుసగా త్రివిక్రమ్, మారుతి సినిమాలు చేయబోతున్నాడు. స్క్రిప్టు వర్క్ పూర్తి అవ్వగానే అధికారికంగా ప్రకటించనున్నారు. నా పేరు సూర్య సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ అభిమానులను రెండు చిత్రాలతో మెప్పించబోతున్నాడు.
The post Bunny to work with Maruthi? appeared first on Social News XYZ.