హిట్స్ ఫ్లాప్స్ కామన్ అంటున్న రవితేజ !
రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రవితేజ సినిమా గురించి మాట్లాడుతూ... ''అమర్ అక్బర్ ఆంటోనీ స్టోరీ చెప్పినపుడే నాకు స్టోరీ బాగా నచ్చింది. ఈ కథ నా బాడీ లాంగ్వేజ్ గు తగ్గట్టు కొన్ని మార్పులు చెప్పాను. శ్రీను వైట్ల స్క్రిప్ట్ వర్క్ బాగా చేశాడు. ఫైనల్ నరేషన్ బాగా నచ్చింది. వెంటనే సెట్స్ మీదకు వెళ్ళాను. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. చూసిన మీరే చెబుతారు.
మూడు పాత్రల్లో నాకు అమర్ పాత్ర చాలా బాగా నచ్చింది. అమర్ క్యారెక్టరైజేషన్ సినిమాకే హైలెట్ అవుతోంది. మిగిలిన రెండు పాత్రలు ఫన్నీగా ఉండబోతున్నాయి. దర్శకుడు శ్రీనువైట్ల ఈసారి తన మైనస్ పాయింట్స్ తెలుసుకొని వర్క్ చేశాడు కావున సినిమా తప్పకుండ సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను. దర్శకుల ఫ్లాప్స్, హిట్స్ నేను పట్టించుకొను. కథ, కథనం బాగుంటే సినిమా ఎవ్వరితోనైనా సినిమా చెయ్యడానికి రెడీ. సినిమా ఒక రివేంజ్ డ్రామాగా ఉంటుంది కానీ దాన్ని తెరమీద చూపించే ప్రయత్నం కొత్తగా ఉండబోతోంది. తమన్ నేపద్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఈ సినిమా చూడ్డానికి వచ్చిన ఎవ్వరూ నిరాశ చెందరని నేను నమ్ముతున్నాను'' అన్నారు
The post Hits and Flops are part of life: Ravi Teja appeared first on Social News XYZ.