Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95059

Vaanavillu finishes Malaysia Schedule

$
0
0

మలేషియాలో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న 'వానవిల్లు'

vaanavillu (15)

రాహుల్‌ ప్రేమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్రం ఇటీవలే మలేషియాలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు అయిన

ప్రతీక్‌ ప్రేమ్‌ మాట్లాడుతూ..ఇదొక వెరైటీ ప్రేమకథ. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ మూవీ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఓ చక్కని ప్రేమకథ ఉంది. ఈ సినిమాకి కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా చాలా చక్కగా కుదిరింది. ప్రస్తుతం మలేషియాలో షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. జూలై మొదటి వారం నుండి కేరళలో మరో షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో చిన్న బిట్‌సాంగ్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరణ జరుగుతుంది. జూలై చివరివారంలో మా సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్‌ స్వరపరిచిన ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము...అని అన్నారు

ప్రతీక్‌ప్రేమ్‌కరణ్‌, శ్రావ్య, విశాఖ, హేమ, ప్రభాస్‌ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్‌, డైలాగ్స్‌: పవన్‌, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: సుబ్బారావు, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: సుభాష్‌, నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: జై, మూర్తి, కెమెరామెన్‌: ఎస్‌.డి. జాన్‌, నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌, స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్‌-దర్శకత్వం: ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌.

vaanavillu (1) vaanavillu (2) vaanavillu (3) vaanavillu (4) vaanavillu (5) vaanavillu (6) vaanavillu (7) vaanavillu (8) vaanavillu (9) vaanavillu (10) vaanavillu (11) vaanavillu (12) vaanavillu (13) vaanavillu (14) vaanavillu (15) vaanavillu (16) vaanavillu (17) vaanavillu (18) vaanavillu (19) vaanavillu (20) vaanavillu (21) vaanavillu (22) vaanavillu (23) vaanavillu (24) vaanavillu (25) vaanavillu (26) vaanavillu (27) vaanavillu (28)

Vaanavillu finishes Malaysia Schedule

vaanavillu (15)
Vaanavillu finishes Malayasia Schedule

Viewing all articles
Browse latest Browse all 95059

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>