Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Brahmotsavam Special Shows in Telangana in all single screens

$
0
0

తెలంగాణలోని అన్ని సింగిల్‌ థియేటర్స్‌లో ఉ|| 8.10 గం||లకు
అభిమానుల కోసం 'బ్రహ్మోత్సవం' స్పెషల్‌ షో

Brahmotsavam_New_Poster

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ట్రైలర్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆడియో సూపర్‌హిట్‌ కావడంతో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఎప్పుడు చూడాలా? అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో, అభిమానుల్లో పెరిగిపోయింది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులకు, అభిమానులకు ఓ శుభవార్త.

మే 20 ఉదయం 8.10 గంటలకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని సింగిల్‌ స్క్రీన్స్‌లో అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం 'బ్రహ్మోత్సవం' స్పెషల్‌ షోను ప్రదర్శించబోతున్నారు. అభిమానులంతా ఈ స్పెషల్‌ షోను ఎంజాయ్‌ చెయ్యబోతున్నారని నిర్మాత పి.వి.పి, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ తెలిపారు. .

Brahmotsavam Special Shows in Telangana in all single screens

Special Show Wallpaper

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>