Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Hero Ram’s cousine’s short film screened at cannes

$
0
0

కాన్స్ చిత్రోత్సవాల్లో తెలుగు కుర్రాడి సినిమా

60 Eight

ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న 'కాన్స్ చలన చిత్రోత్సవాల' పైనే ఇప్పుడు అందరి దష్టీ ఉంది. ఈ నెల 11న ఆరంభమైన ఈ చిత్రోత్సవాలు 22 వరకూ జరుగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో ఇప్పటికే మన భారతీయ నటీమణులు ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్, సోనమ్ కపూర్ మెరిశారు. ఐష్ నటించిన 'సరబ్ జిత్' ప్రీమియర్ షో అక్కడ జరిగింది. కాగా, మన తెలుగు పరిశ్రమ నుంచి 'బాహుబలి' స్ర్కీనింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అలాగే,  వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడ జరిగే చర్చా వేదికలో పాల్గొననున్నారు. అదో విశేషం అయితే.. అక్కడి షార్ట్ ఫిలిం విభాగంలో మన తెలుగు కుర్రాడి సినిమా సెలక్ట్ కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ చిన్న తమ్ముడు డా. రమేశ్ బాబు కొడుకు, హీరో రామ్ కజిన్ బ్రదర్ రాజా నిషాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. '60 ఎయిట్' పేరుతో స్వీయ దర్శకత్వంలో రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ప్రధానంగా ఎనిమిదేళ్ల కుర్రాడి చుట్టూ తిరిగే చిత్రం ఇది. 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందడం మనకు గర్వకారణం. ఈ చిత్రకథను దర్శకుడు రాజా పోతినేనియే రాసుకున్నారు.

http://sub.festival-cannes.fr/SfcCatalogue/MovieDetail/bd533505-221a-46aa-be44-45a6c6044544

Hero Ram's cousine's short film screened at cannes

Hero Ram’s cousine’s short film sc

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>