అందర్నీ ఆకట్టుకుంటున్న 'బ్రహ్మోత్సవం' భారీ వినైల్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన భారీ వినైల్ అందర్నీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో 150 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తు కలిగిన భారీ వినైల్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ వినైల్ ఫిలిం నగర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.



