Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Manchu Lakshmi’s new movie lunch on May 20th

$
0
0

మే 20న మంచు లక్ష్మి ప్రసన్న కొత్త చిత్రం ప్రారంభం

Lakshmi Manchu in Basmati Blues

Lakshmi Manchu in Basmati Blues

మంచు వారసురాలిగా, నటిగా, నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటన పరంగా విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. గుణపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ మాట్లాడుతూ ‘’మంచు లక్ష్మిగారు కథ వినగానే చేయడానికి ఒప్పుకున్నందుకు ఆమెకు మా సంస్థ తరపున ధన్యవాదాలు. జగపతిబాబుగారితో సాధ్యం, నవదీదప్ తో వసూల్ రాజా వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ చెప్పిన కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా మే 20న లాంచనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది. థ్రిల్లర్ కామెడి సబ్జెక్ట్ తో రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. హైదరాబాద్ లో జరిగే సింగిలో షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం. మంచి టీంతో సినిమాను నిర్మిస్తాం. సినిమా ప్రారంభోత్సవం రోజున మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘’మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్రలో కనపడనున్నారు. న్యాయం కోసం పోరాడే జడ్జ్ పాత్రలో మంచు లక్ష్మి ప్రసన్నగారి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’’అన్నారు.

Manchu Lakshmi's new movie lunch on May 20th

Manchu Lakshmi’s new movie lunch on May 20th

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>