క్లైమాక్స్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ శంషాబాద్ టెంపుల్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ - ''సినిమా చాలా బాగా వస్తోంది. డైరెక్టర్ వీరభద్రమ్ చాలా ఎక్స్‌లెంట్‌గా తీస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో తీసిన ఇంట్రడక్షన్ సాంగ్, రాజమండ్రిలోని అందమైన లొకేషన్స్‌లో తీసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించి, క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. డ్రాగన్ ప్రకాష్ ఈ క్లైమాక్స్‌ను ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు'' అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - ''డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో క్లైమాక్స్ తీస్తున్నాం. పూలరంగడు క్లైమాక్స్‌ని కూడా శంషాబాద్ టెంపుల్‌లోనే తీశాము. ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఇక్కడే తియ్యడం చాలా హ్యాపీగా వుంది. ఆది, నమిత ప్రమోద్, విలన్ జాన్ కొక్కీన్‌లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ క్లైమాక్స్‌లో పాల్గొంటోంది. క్లైమాక్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
లవ్‌లీ రాక్‌స్టార్ ఆది, నమిత ప్రమోద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్, అభిమన్యు సింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, అనితనాథ్ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్, స్టిల్స్: గుణకర్, నిర్మాతలు: వెంకట్ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్.











