Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

G.V Prakash’s Pencil to release on May 13th

$
0
0

మే 13న రిలీజ్‌కి సిద్ధమవుతున్న 'పెన్సిల్‌'

Pencil Audio Poster and Stills

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ట్రైలర్స్‌ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. 'పెన్సిల్‌' తెలుగులో నాకు హీరోగా మంచి బ్రేక్‌ ఇస్తుందన్న నమ్మకం నాకు వుంది. డైరెక్టర్‌ మణి నాగరాజ్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మీ స్కూల్‌ లైఫ్‌ని, మీ చిన్న నాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేశాం. మే 13న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని చూసి అందరూ చూసి ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత, నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''జి.వి.ప్రకాష్‌ చేసిన సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అయిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాకి కూడా మ్యూజికల్‌గా చాలా మంచి పేరు వస్తోంది. ఆల్రెడీ ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. మే 13న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా అందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది'' అన్నారు.

జి.వి.ప్రకాష్‌కుమార్‌, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్‌ హాసన్‌, విటివి గణేష్‌, ఊర్వశి, టి.పి.గజేంద్రన్‌, అభిషేక్‌ శంకర్‌, ప్రియా మోష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: రాజీవన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్‌.

G.V Prakash's Pencil to release on May 13th

G.V Prakash’s Pencil to release on May 13th

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>