తండ్రీ కొడుకుల నాటుకోడి
అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌కు, నిజాయతీగల కానిస్టేబుల్‌కు మద్య జరిగే కథతో తెరకెక్కిన చిత్రం నాటుకోడి. నానికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. నానిగాడి సినిమా పతాకంపై రూపొందుతోంది. బండారు బాబీ, నాని కృష్ణ నిర్మాతలు. శ్రీకాంత్, మనో చిత్ర జంటగా నటించారు. దర్శకుడు మాట్లాడుతూ “ఇందులో కానిస్టేబుల్‌గా కోటా శ్రీనివాస్, అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ నటించారు. వీరిద్దరూ తండ్రీ కొడుకుల పాత్రలను పోషించారు. కథాకథనాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. యాజమాన్య సంగీతం మెప్పిస్తుంది“ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “మాస్ ఎంటర్‌టైనర్ ఇది. పాలకొల్లు పరిసరాల్లో సినిమాను తెరకెక్కించాం“ అని చెప్పారు.
కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, జీవా, సలీమ్ పాండా (ఘర్షణ), సత్తిరెడ్డి, రోలర్ రఘు, కాదంబరి కిరణ్, చిరునవ్వుతో ప్రభు, బోస్ బాబు, జయవాణి, నేహా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: యాజమాన్య, కెమెరా: మల్లేశ్ నాయుడు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, డ్యాన్స్: ప్రదీప్ ఆంటోనీ.













