Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Sarvanand and Lavanya Tripathi in B.V.S.N Prasad’s big budget movie

$
0
0

శర్వానంద్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

sarvand_bvsn movie

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'డార్లింగ్‌' చిత్రానికి కరుణాకరన్‌ వద్ద అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.23గా ఈ చిత్రం రూపొందుతుంది.

ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''మా డార్లింగ్‌ చిత్రానికి అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ ఒక మంచి సబ్జెక్ట్‌ చెప్పారు. ఈ సబ్జెక్ట్‌ విని శర్వానంద్‌ చాలా ఇంప్రెస్‌ అయ్యారు. మా అందరికీ ఈ కథ బాగా నచ్చింది. చంద్రమోహన్‌ని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్‌ చేస్తూ వెంటనే ఈ సినిమాని స్టార్ట్‌ చేస్తున్నాం. జూన్‌ 1 నుంచి నాన్‌స్టాప్‌గా ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. ఈ చిత్రంలో నటించే మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు.

శర్వానంద్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించే ఈ చిత్రానికి సంగీతం: రతన్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, లైన్‌ ప్రొడ్యూసర్‌: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, దర్శకత్వం: చంద్రమోహన్‌ చింతాడ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>