"నేనోరకం" టీజర్ టాక్...
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది .త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చెయనున్నారు.. ఈసందర్బంగా ..
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నేనోరకం అనే టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది.ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..
శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.నేనోరకం సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కధ, కధనమే ఈ సినిమాకు హైలెట్.మా సినిమా టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..
దర్శకుడు మాట్లాడుతూ.. నేనోరకం టీజర్ కు మేము ఊహించిన దాని కంటే మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ లభించాయి.సినిమా సైతం టైటిల్ కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్ మెంట్ తో రూపొందించటం జరిగింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందించే చిత్రమిదని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... సినిమా టీజర్ కు రెస్పాన్స్ బాగుంది.త్వరలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా మరియు టైటిల్ ను సిద్దం చేయటం జరిగింది. రాధిక శరత్ కుమార్ గారు తమిళ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంపై 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..
రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారయణ్




