బాహుబలి మాయలో కుర్ర హీరో
'వినవయ్యా రామయ్య' ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమాకు రంగం సిద్దమైంది. ఎంతో కాలంగా సరైన కథ కోసం ఎదురుచూసిన అన్వేష్ చివరకు ఓ కథను ఒకే చేసి ఆరు నెలలుగా దాని పై వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ యంగ్ హీరో రెండో సినిమా సెట్స్ పైకి రావడం ఖాయమనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 'బాహుబలి'కి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన 'బాహుబలి'పళని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విన్న నాగ అన్వేష్ చివరకు 'బాహుబలి' పళని చెప్పిన కథనే ఎన్నుకున్నాడనాకి అసలు కారణం 'బాహుబలి'కి వచ్చిన ఫలితమే అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.. మరోవైపున 'బాహుబలి' పళనికి సైతం రాజమౌళి బ్రాండ్ వాడుకొని పెద్ద హీరోల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. అంతే కాకుండా కొంత మంది హీరోలు పళని చెప్పిన కథ పై ఆసక్తి చూపించినప్పటకీ.. పళని మాత్రం దర్శకుడిగా తన మొదటి సినిమాలో నాగ అన్వేష్ నే హీరోగా ఎన్నుకోవడం గమనార్హం. ఇక ఈ చిత్రం ఎప్పుడు మొదలవ్వబోతుంది. హీరోయిన్ ఎవరు తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ లో నాగ అన్వేష్ ను 'బాహుబలి' పళని ఎలా చూపబోతున్నాడో.. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల్ని ఏ రీతిన మెప్పిస్తారో చూడాలి...
బాహుబలి దర్శకుడిని మెప్పించాడాట!
కథ, కథనాలు పై ఆసక్తి, నమ్మకంతోనే తన రెండో చిత్రానికి పూనుకున్నామని అంటున్నాడట..'వినవయ్యా రామయ్య' ఫేమ్ నాగ అన్వేష్... 'ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు' చిత్రంతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకుని... ఆ తరువాత హీరోగా అరంగేట్రం చేసిన మొదటి సినిమాతోనే నటుడిగా ప్రేక్షకుల మెప్పుపొందిన నాగ అన్వేష్ ప్రస్తుతం తన రెండో సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ 'బాహుబలి'కి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన 'బాహుబలి'పళని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విన్న నాగ అన్వేష్ చివరకు 'బాహుబలి' పళని చెప్పిన కథనే ఎన్నుకున్నాడనాకి అసలు కారణం 'బాహుబలి'కి వచ్చిన ఫలితమే అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడు మొదలవ్వబోతుంది. హీరోయిన్ ఎవరు తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ లో నాగ అన్వేష్ ను 'బాహుబలి' పళని ఎలా చూపబోతున్నాడో.. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల్ని ఏ రీతిన మెప్పిస్తారో చూడాలి...



