Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95890

Brahmotsavam’s Vachindi Kada Avakasam song gets super response

$
0
0

'వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం..'

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'బహ్మోత్సవం' సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

Vacchindi Kada Avakasam Lyrical Video | Brahmotsavam | Mahesh Babu Kajal Aggarwal_img

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియోను మే 7న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. కాగా, ఈ చిత్రంలోని ఓ పాటను మంగళవారం విడుదల చేశారు. 'వచ్చింది కదా అవకాశం..' అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, అభయ్‌ జోద్పూర్‌కర్‌ గానం చేశారు. ఈ పాటకు అన్ని చోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ - ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న మా 'బ్రహ్మోత్సవం' చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అద్భుతంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని 'వచ్చింది కదా అవకాశం..' అనే పాటను నిన్న రిలీజ్‌ చేశాం. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటతో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి. మిక్కీ జె.మేయర్‌ మ్యూజిక్‌ సినిమాకి చాలా పెద్ద హైలైట్‌ అవుతుందని ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాట రిలీజ్‌ అయిన తర్వాత ఆడియోపై కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. మే 7న మా 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల, మిక్కీ జె.మేయర్‌ కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Brahmotsavam's Vachindi Kada Avakasam song gets super response

Brahmotsavam’s Vachindi Kada Avakasam song gets super response

Viewing all articles
Browse latest Browse all 95890

Latest Images

Trending Articles



Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>