Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Rashmi Gautam’s Antham first look released for her Birthday

$
0
0

అందాల భామ ర‌ష్మీ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా సస్పెన్స్‌ థ్రిల్లర్ గా అంతం ఫస్ట్ లుక్ విడుదల

రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం అంతం. రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం చిత్రాన్నే మా చిత్రానికి టైటిల్ గా పెట్టామని దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెలియజేశారు. అంతం తరహాలోనే ఈ చిత్రానికి సైతం చాలా మంచి క్రేజ్ తీసుకొస్తుందన్నారు. అందాల భామ ర‌ష్మీ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుద‌ల చేశారు.ఇప్ప‌టికే ఈచిత్ర షూటింగ్ పూర్త‌య్యి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత‌లు తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ రష్మీ గౌతమ్ మంచి పేరు సంపాదించింది. ఇదే కోవలో అంతం చిత్రంలోని క్యారెక్టర్ కు సైతం మంచి పేరొస్తుందని బలంగా నమ్ముతోంది. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాధ్యతలు కూడా కళ్యాణ్ చేపట్టడం విశేషం. కార్తిక్ సంగీతమందించాడు.

ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... రాంగోపాల్ వర్మ అంతం చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్మ గారికి నేను వీరాభిమానిని. అందుకే ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ అంతం అనే టైటిల్ ను నా తొలి చిత్రానికి పెట్టాను. అదే తరహాలో చిత్ర కథ కూడా అంతే అద్భుతంగా కుదిరింది. ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను. రష్మీ గౌతమ్ గ్లామర్ తో పాటు పెర్ పార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ర‌ష్మీ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ర‌ష్మి గ‌త చిత్రాలకంటే ఈచిత్రంలో త‌న చ‌క్క‌టి న‌ట‌న చూపించారు. లేడి ఓరియంటెడ్ చిత్రాల‌కు యాప్ట్ అయ్యేలా ర‌ష్మీన‌ట‌న ఈచిత్రం లో వుండ‌బోతుంది. చిత్రం చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఈచిత్రంలో చివ‌రి భాగంలో ర‌ష్మి ఫెర్‌ఫార్మెన్స్ కి థ్రిల్ ఫీల్ అవుతారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.

నటీనటులు
రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్

సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు

Antham Stills Antham Stills Antham Stills Antham Stills Antham Stills

Rashmi Gautam's Antham first look released for her Birthday

Rashmi Gautam’s Antham First Look Release on her Birthday

Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>