ఈ నెల 29న వస్తున్న ధనుష్-కాజల్ "మాస్"
ధనుష్- కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన "మారి" తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.
నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అన్నారు.
విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!




