జ్యోత్స్న ఫిలిమ్స్ పతాకంపై దర్శకులు "సాగర్" గారు, కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "చారుశీల". ఫస్ట్ లుక్ మరియు లోగోలతో మంచి రెస్పాన్స్ సంపాదించుకుని, ఇటీవలే విడుదలయిన టీజర్ తో అందరిని ఆకట్టుకుంటూ ప్రస్తుతం యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న సందర్బంలో.. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మే 6వ తేదీన సూర్య నటించిన "24" చిత్రంతో వెండితెరపై అందరిని అలరించనుంది.ఇటీవలే టీజర్ ని ప్రత్యేకంగా చూసిన దర్శకరత్న డాII "దాసరినారాయణ రావు" గారు ఇదో మంచి తెలుగు చిత్రం అవుతుందని కితాబునిచ్చిన ఈ చిత్ర టీజర్ విడుదల సందర్బంగా విచ్చేసిన ప్రముఖులు వి.వి.వినాయక్, సుకుమార్, బి.గోపాల్, కళ్యాణ్ కృష్ణ, ఎస్.వి.కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారి గురువుగారైన ఎస్.గోపాల్ రెడ్డి మరియు అచ్చిరెడ్డి లు తమ చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేసి కెమెరామెన్ గా ఎన్నో విజయాల్ని అందుకున్న వి.శ్రీనివాసరెడ్డి గారికి దర్శకుడిగా "చారుశీల" మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తూ, టీజర్ చూస్తుంటే చారుశీలగా నటించిన రష్మీ, రాజీవ్ లు తమ నటనకి జీవం పోసినట్టుగా ఉంది అని తెలిపారు. అలాగే ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్న జశ్వంత్ కి మరియు చిత్ర యూనిట్ కి అందరికి ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇస్తుందని ఆశాభావం తెలిపారు.
ఈ రోజు (27-4-16)న పుట్టిన రోజు జరుపుకుంటున్నరష్మీ గౌతం కి "చారుశీల"యూనిట్ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.





