నందమూరి బాలకృష్ణ, క్రిష్ లను అభినందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర తెలియాల్సిన అవశ్యకత తెలుగువారికెంతైనా ఉంది. ఆయన చరిత్రను సినిమాగా తీస్తున్న ప్రయత్నం గొప్ప ప్రయత్నమంటూ ఇద్దరినీ అభినందించారు.
ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సింది. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండటం, అవి ముందుగా నిర్ణయించబడటం వల్ల తాను మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలియజేశారు.


