మొదటి షెడ్యూల్ లో లార్డ్ శివ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1
లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా పర్వీన్ రాజ్, పూజిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా....
దర్శకుడు శేషసాయి మరుప్రోలు మాట్లాడుతూ ‘’సినిమా చిత్రీకరణలో భాగంగా తొలి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రస్తుతం పర్వీన్ రాజ్, పూజితల మీద మంచి లోకేషన్స్ లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ నెలాఖరుతో మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేస్తాం. నెక్ట్స్ షెడ్యూల్ ను మే మొదటివారంలో ప్రారంభించి మే నెలాఖరుకు పూర్తి చేస్తాం. ప్రస్తుత సమాజంలో యువత ఎలా ఉందనే కాన్సెప్ట్ పై రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’తొలి సాంగ్ ను భాను మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నాం. నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాక్షిచౌదరి ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నాం’’ అన్నారు.
సాక్షిచౌదరి, పర్వీన్ రాజ్, పూజిత, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాకేష్, సంతోష్, ఇంద్ర, అవంతిక, అక్షర, శ్రావణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: కె.శంకరరావు, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి, రచన, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు




