Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95890

I Want To Establish Myself As A South Indian Star, Says Allu Arjun

$
0
0

దక్షిణాది భాషా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం - అల్లు అర్జున్

Allu Arjun Press Meet in Bangalore

Allu Arjun Press Meet in Bangalore

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది చిత్ర సీమలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ ఖర్చుతో గ్రాండియర్ గా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా బెంగళూరులో జరిగిన సరైనోడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కన్నడ భాషలో మాట్లాడడంతో... అభిమానులు విజిల్స్, కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.  కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.

నాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తెలుగు తర్వాత కర్ణాటకలో ఉన్న అభిమానులు ప్రత్యేకం. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతీ ఒక్క మెగాభిమానికి, ప్రేక్షకులకు ఏంతో రుణపడి ఉంటాను. నా చిత్రాలు ఇక్కడ ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కన్నడ చిత్రాల్ని నేను ఎంతో గౌరవిస్తాను. గత మూడు సంవత్సరాలుగా కన్నడ చిత్రాల్లో ఎంతో పురోగతి కనిపిస్తోంది. చాలా మంచి చిత్రాలొస్తున్నాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. నాకు రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. త్వరలోనే తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయబోతున్నాను. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. సరైనోడు పూర్తి స్థాయి మాస్ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటరై టనర్. డైరెక్టర్ బోయపాటి అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. నా కోసం ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. అభిమానులతో పాటు... ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.  అని అన్నారు.


Viewing all articles
Browse latest Browse all 95890

Latest Images

Trending Articles



Latest Images