కువైట్ లో 'గల్ఫ్' పాట, టీజర్ విడుదల
జీవితం పట్ల ఎన్నో ఆశలతో గల్ఫ్ కు వలస వెళ్లిన భారతీయుల కష్టసుఖాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గల్ఫ్'. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గల్ఫ్దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించడంతో పాటు 500 కేస్ స్టడీస్ తో యదార్ధ ఘటనల ఆధారంగా ఈ కధ తయారు చేసుకున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ ఇమ్మడి స్వరాలందించారు. ఈ సినిమా చిత్రీకరణ పలు ప్రదేశాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఎక్కువమందికి దగ్గర చేయడం కోసం సునీల్ కుమార్ రెడ్డి విభిన్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా పాటలను, టీజర్ లను గల్ఫ్ లోని వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరిస్తున్నారు. మస్కట్ లో తొలి పాట, టీజర్ ను, దుబాయ్ లో రెండో పాట, టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం కువైట్ లో మూడో పాట, ఆడియో టీజర్ ను విడుదల చేశారు.. మాస్టర్ జీ సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్ ఆలాప్స్ అందించగా, హైమత్, మోహనా భోగరాజు ఆలపించారు. కువైట్ లో రియాలోని ఇంటర్నేషనల్ ఆర్ట్స్ అకాడమీలో పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కువైట్ తెలుగు కళా సమితి అధ్యక్షుడు వెంకట్ కందూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కువైట్ ప్రముఖ వ్యాపారవేత్త మిషాప్ అల్ సలీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుధాకర్ రావు, మోహన్ బాబు, గిరి ప్రసాద్, తాడూరి శ్రీరామ్, శ్రీనివాస్ తదితర అతిథులు పాల్గొన్నారు.
ఈ సినిమాలో కధానాయకుడు, నాయికలుగా కొత్తవారు నటిస్తుండగా ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరాం, నాగినీడు












