Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94849

Good days began for Telugu Cinema with Mallesham: Priyadarshi

$
0
0

మల్లేశంతో తెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి - హీరో ప్రియదర్శి

Good days began for Telugu Cinema  with Mallesham: Priyadarshi

Good days began for Telugu Cinema with Mallesham: Priyadarshi (Photo:SocialNews.XYZ)

మల్లేశం చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా ఈ చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ...

ముందుగా మీడియా వారికి కృతజ్ఞతలు, మంచి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయ్యింది. ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుండగా బస్సులో డ్రైవర్ తెలుగు సినిమా వేశారు, ఆ సందర్భంలో అక్కడున్న పబ్లిక్ తెలుగు సినిమా వద్దు, ఎప్పుడూ చూసిన ఒకే మూస ధోరణిలో సినిమాలు ఉంటాయని చెప్పడం విన్న నాకు భాదేసింది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ధోరణి మారింది. కొత్త కథలు కొత్త దర్శకులు వస్తున్నారు. మల్లేశం లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వెంకట్ సిద్దారెడ్డి కృషి ఎంతో ఉంది. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజ్ గారు ఈ సినిమాను చేయాలనుకోవడం అందులో నేను భాగం అవ్వడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఇటీవల వైజాగ్, రాజమండ్రి లో ఈ చిత్ర సక్సెస్ టూర్ ను నిర్వహించాము. అక్కడ వారి స్పందన చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్ చెబుతున్నాను"అన్నారు.

హీరోయిన్ అనన్య మాట్లాడుతూ...

మల్లేశం సినిమా చూసి నా నటన గురించి అందరూ మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. నటి అవ్వాలని కోరిక ఈ సినిమాతో నెరవేరింది. దర్శకుడు రాజ్ గారికి ధన్యవాదాలు, ఈ పాత్రకోసం నన్ను తీసుకున్నందుకు. షూటింగ్ సమయంలో హీరో దర్శి సపోర్ట్ మరువలేనిది. ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసారు వారందరికీ థాంక్స్" అన్నారు.

దర్శకుడు రాజ్ మాట్లాడుతూ...

మల్లేశం చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి సక్సెస్ కు కారణం అయిన పిఆర్వో వంశీశేఖర్ కు థాంక్స్. నటీనటులందరు ఈ సినిమాలో బాగా చేశారు వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా టెక్నీషియన్స్ సపోర్ట్ మరువలేనిది. పెద్దింటి అశోక్ డైలాగ్స్, కెమెరామెన్ బాలు, రచయిత గోరింటి వెంకన్న, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, కాస్ట్యూమ్స్ శ్రీపాల్ ఇలా అందరి సహకారం మరువలేనిది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి మాట్లాడుతూ... నేను ఎనిమిది, తొమ్మిది ఏళ్ళ క్రితం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రకరకాల జాబ్స్ చేసాను. ఇటీవల విడుదలైన కేర్ ఆఫ్ కాంచరపాలెం సినిమాకు పని చేసిన తరువాత సంతృపినిచ్చింది. ఆ సినిమా తరువాత మెంటల్ మదిలో మల్లేశం సినిమాకు వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. మల్లేశం సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. దర్శకుడు రాజ్ గారు కేవలం ఈ సినిమా చెయ్యాలని సంకల్పంతో ముందుకు వెళ్లారు. ఆయన అనుకున్న దానికంటే ఈరోజు ఎక్కువగా ఆడియన్స్ ఈ సినిమాను రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ...

కేవలం సినిమా మీద ఫ్యాషన్ తో దర్శకుడు రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. మీడియా ఈ సినిమాను బాగా సపోర్ట్ చేసింది. నేను ఈ సినిమా చేస్తున్న సమయంలో వేరే సినిమా చేస్తున్నా అందువల్ల ఈ సినిమాకు కాస్త ఆలస్యంగా ట్యూన్స్ ఇచ్చినా దర్శకుడు రాజ్ గారు నన్ను ప్రోత్సహించిన విధానం మర్చిపోలేనిది. ప్రియదర్శి , అనన్య మిగిలిన నటీనటులందరు బాగా చేసారు. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్" అన్నారు.

Good days began for Telugu Cinema with Mallesham: Priyadarshi

Priyadarshi Emotional Speech At Mallesham Movie Sucess Meet (Video)__img

The post Good days began for Telugu Cinema with Mallesham: Priyadarshi appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94849

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>