Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94814

Naga Chaitanya – Shekar Kammula – Sai Pallavi – Asian group film launched

$
0
0

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం.

Naga Chaitanya - Shekar Kammula - Sai Pallavi - Asian group film launched

Naga Chaitanya – Shekar Kammula – Sai Pallavi – Asian group film launched (Photo:SocialNews.XYZ)

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి టెంపుల్ లో జరిగాయి.

ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం తో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది.

డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విజయ్.సి.కుమార్.. ఇతర ఆర్టిస్టులు,సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.

The post Naga Chaitanya – Shekar Kammula – Sai Pallavi – Asian group film launched appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94814

Trending Articles