అభిమానుల డిమాండ్ మేర ఇండియాలో ముందుగానే విడుదలవుతున్న `స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం`


వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న సూపర్ హీరో స్పైడర్ మ్యాన్. అవెంజర్స్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం
రికార్డులను బ్రేక్ చేయడానికి స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం
సిద్ధమవుతోంది. స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం
చిత్రాన్ని ఓ రోజు ముందుగానే సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా విడుదల చేస్తుంది. ఇంగ్లీశ్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జూలై 4న ఈ సినిమా భారీ రేంజ్‌లో విడుదలవుతుంది. మార్వెల్ సంస్థ నుండి వస్తున్న సినిమాలపై క్రేజ్ క్రమంగా పెరుగుతుంది.
ఈ సందర్భంగా... సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ నాని మాట్లాడుతూ సూపర్‌హీరో స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రారంభం నుండే `స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నాం. 30వ తారీఖునే ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నాం
అన్నారు.
The post Spider Man: Far From Home movie is releasing early in India due to fans demand appeared first on Social News XYZ.