హీరో ఆది సాయికుమార్ 'బుర్రకథ' ట్రైలర్‌ను ఆవిష్కరించిన విక్టరీ వెంకటేశ్

దీపాల ఆర్ట్స్ టప్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బుర్రకథ'. డైమెండ్ రత్నంబాబు దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన రాబట్టుకుంది. ప్రస్తుతం హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సందర్భంగా
హీరో వెంకటేష్ మాట్లాడుతూ . ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. వండర్ ఫుల్ స్టోరీ. ఆది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డైమండ్ రత్నం బాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ బ్యూటిఫుల్ స్టోరీని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతున్నాను
అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ ఈరోజు వెంకటేష్ గారి చేతులమీదుగా ట్రైలర్ లాంచ్ అయ్యింది. ఈ చిత్ర టీజర్ చూసి వింటేజ్ క్రియేషన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి రైట్స్ కొన్నారు.. ఈ నెల 28న చాలా కాన్ఫిడెంట్‌గా గ్రాండ్ రిలీజ్‌తో మీముందుకు వస్తున్నాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు
అని తెలిపారు.
డైరెక్టర్ డైమెండ్ రత్నం బాబు మాట్లాడుతూ ``ఒక హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్ అనే వాడు వస్తాడు. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. ఈ సినిమాకు నన్ను నమ్మిన వారి కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పని చేశాను. ఈ చిత్ర టీజర్ చూడగానే జీ సినిమా వాళ్ళు తీసుకుంటామని అడిగారు. అలానే వింటేజ్ క్రియేషన్స్ వారు కూడా విడుదల చేయడానికి ముందుకు వచ్చారు అందుకు వారికి నా కృతఙ్ఞతలు. ఇక సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుండడంతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. విలువలు ఉన్న సన్నివేశాలు కూడా చాలా ఉన్నయి. సినిమా లో పాత్రలు కంట తడిపెట్టారంటే సాధారణ విషయమే.. కానీ అదే ఆడియన్స్ కంట తడి పెట్టారంటే ఆ సినిమా హిట్ అయినట్టే.. మా ఈ బుర్రకథ కూడా తప్పకుండా అందరికి నచ్చి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మనకంతో ఉన్నామని చెప్పారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనరే కానీ మేమంతా ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేశాం. యూనిక్ లైన్ కానీ ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ ప్లే చాలా క్లారిటీ తో అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్ ఇచ్చారు. వెంకటేష్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. నాని, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లతో సహా మిగతా హీరోలందరూ సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్ చేశారు. అందుకు వారందరికీ పేరు పేరునా నా కృతఙ్ఞతలు. చాలా కాలం అయ్యింది హిట్ పడి.. అది ఈ సినిమాతో జరుగుతుందని, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం
అన్నారు.
మరో ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇది నా 4 వ సినిమా.. గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను
అన్నారు.
పృధ్వి మాట్లాడుతూ కథ మీద కమాండ్ తో క్లారిటీ గా తెరకెక్కించాడు దర్శకుడు డైమండ్ రాజు. షూటింగ్ కూడా ఉదయం 10గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 3 గంటల కల్లా ముగించేసేవాడు. అంటే ఎంత క్లారిటీ తో వర్క్ చేసాడో అర్థం అవుతుంది. ఆది రెండు పాత్రల్లో అద్భుతంగా పెర్ఫామెన్స్ ఇచ్చారు. తనకో మంచి హిట్ పడుతుంది. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా మీ ముందుకు వస్తున్నాం
అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ డైమండ్ రత్నంగారితో కలసి ఈడో రకం ఆడో రకం మూవీకు పనిచేశాను. బుర్రకథ కథ సినిమా చాలా అధ్బుతంగా ఉంటుంది అందుకు తగ్గట్టె మ్యూజిక్ కూడా కుదిరింది. అందరినీ అలరిస్తుందని అలానే మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను
అన్నారు.
హీరోయిన్ మిస్తీ చక్రవర్తి, పృధ్వి రాజ్(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), గాయత్రి గుప్తా, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు:
ఆది సాయికుమార్
మిస్తీ చక్రవర్తి
నైరా షా
రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి,
పథ్వీరాజ్
గాయత్రి గుప్తా
అభిమన్యుసింగ్, ఫిష్ వెంకట్
ప్రభాస్ శ్రీను
గీతా సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
నిర్మాత: హెచ్.కె.శ్రీకాంత్ దీపాల
నిర్మాణ సంస్థ: దీపాల ఆర్ట్స్
మ్యూజిక్: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, సయ్యద్, ప్రసాద్ కామినేని, సురేష్ ఆరపాటి, దివ్యభవాన్ దిడ్ల
ఆర్ట్: చిన్నా
సాహిత్యం: శివ శక్తిదత్తా, భాస్కర్ల భట్ల, కె.కె,
ఫైట్స్: వెంకట్, సల్మాన్ రాజ్, రియల్ సతీష్



The post Venkatesh Launched The Theatrical Trailer Of Burrakatha appeared first on Social News XYZ.