Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

Doctor Gurava Reddy About Sharwanand’s Operation & Health Condition (Video)

$
0
0

Doctor Gurava Reddy About Sharwanand's Operation & Health Condition (Video)

Hero Sharwanand underwent a successful shoulder surgery yesterday and on Tuesday morning he is shifted from ICU to a room.

Speaking to the media on it Managing Director of Sunshine Hospitals, Dr. Guruva Reddy said, “I know Sharwa for the last 15 years and he is a family member. In an unfortunate incident, he sustained a shoulder injury while training in skydiving. The surgery to the shoulder bone was held for four hours. Then the plastic surgery took around five hours followed by observation for three and a half hours. As the injury was complicated, the surgery took time.”

The doctor added that Sharwa will be discharged from the hospital in two days but will continue to stay under his team’s observation. For the next two months, Sharwa will undergo physiotherapy as there will be stiffness in the right shoulder.

Dr. Guruva Reddy claimed that there is no need to panic and he will be back with double the energy to entertain the Telugu audience like before.

శ‌ర్వానంద్ ఆప‌రేష‌న్ పూర్తి.. రెండు రోజుల్లో డిశార్జ్‌.. ఫిజియోథెర‌పీ చికిత్సను అందిస్తాం - స‌న్ షైన్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.గుర‌వారెడ్డి

96 చిత్రీక‌ర‌ణ‌లో స్కై డైవింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి గాయాల‌య్యాల‌యి. షోల‌ర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుండి హైద‌రాబాద్ చేరుకుని, వెంట‌నే స‌న్‌షైన్ హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు. స‌న్ షైన్ హాస్పిట‌ల్స్ మ‌నేజింగ్ డైరెక్ట‌ర్ డా.గురవారెడ్డి ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం శ‌ర్వానంద్ భుజానికి శ‌స్త్ర చికిత్స చేశారు.

నాలుగు గంట‌ల పాటు స‌ర్జ‌రీ, ఐదు గంట‌ల పాటు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఆప‌రేష‌న్ త‌ర్వాత మూడు గంట‌ల పాటు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. నిన్న సాయంత్రం ఐదు గంట‌ల త‌ర్వాత ఐ.సి.యులో ఉంచారు. ఈరోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం ప‌ద‌కొండున్న‌ర గంట‌ల త‌ర్వాత రూమ్‌కు షిఫ్ట్ చేశారు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం స‌న్ షైన్ హాస్పిట‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్,

డాక్ట‌ర్ గుర‌వా రెడ్డి మాట్లాడుతూ - శ‌ర్వానంద్‌తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబ స‌భ్యుడిగా భావిస్తుంటాను. దుర‌దృష్ట‌వ‌శాతు థాయ్‌లాండ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో త‌న షోల్డ‌ర్ బోన్ ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఆ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా అయ్యింది. త‌ను మా హాస్పిట‌ల్‌కు రాగానే ప‌రీక్ష‌లు చేశాం. సోమ‌వారం మా మెడిక‌ల్ టీం డా.క‌మ‌లాక‌ర్‌, డా.సుబ్ర‌మ‌ణ్యం, డా.చంద్ర‌శేఖ‌ర్‌, ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డా.భ‌వానీ ప్ర‌సాద్‌, ఎన‌స్త‌టీషియా డా.గిరిధ‌ర్ స‌హా నా ఆధ్వ‌ర్యంలో నాలుగు గంట‌ల పాటు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. బోన్ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా ఉండ‌టం వ‌ల్ల చాలా టైం ప‌ట్టింది. అయితే ఆప‌రేష‌న్ స‌క్సెస్‌ను ఫుల్‌గా పూర్తి చేశాం. రైట్ షోల్డ‌ర్ కాబ‌ట్టి స్టిఫ్‌గా ఉంటుంది. మామూలుగా కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. రెండు నెల‌ల పాటు ఫిజియోథెర‌పీ చికిత్సను అందిస్తాం. ఇది కాకుండా కాలిలో ఓ చిన్న ఫ్రాక్చ‌ర్ ఉంది. దీని గురించి పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఈరోజు ఐసియు నుండి రూమ్‌కు షిఫ్ట్ చేశాం. రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. ఈ రెండు గాయాలు త‌ప్ప‌.. మ‌రే స‌మ‌స్య‌లు లేవు. త‌ను త్వ‌ర‌గానే కోలుకుంటాడు అన్నారు.

The post Doctor Gurava Reddy About Sharwanand’s Operation & Health Condition (Video) appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>