హీరో శర్వానంద్‌కు షూటింగ్‌లో ప్రమాదం
యువ హీరో శర్వానంద్‌కు 96
షూటింగ్‌లో గాయాలయ్యాయి. 96
షూటింగ్‌లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
కాళ్లపై ల్యాండ్ కావాల్సిన వ్యక్తి భుజాలను మోపి ల్యాండ్ అయ్యారు. ఆ కారణంగాషోల్డర్ డిస్ లొకేట్ అయ్యింది. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా వెళ్లి సన్ షైన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శర్వాను పరీక్షించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, కాబట్టి శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్రచికిత్స జరగనుంది. సర్జరీ తర్వాత కనీసం నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్స్ శర్వాకు సూచించారు.
The post Hero Sharwanand gets injured during 96 movie shoot rehearsals appeared first on Social News XYZ.