పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూత్ ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ 'యురేక' చిత్రం..!!



కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మాత గా తెరకెక్కిన చిత్రం 'యురేక'.. యూత్ ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా లలితకుమారి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ విడుదల కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..
దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ... థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన యురేకా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది... ప్రస్తుతం 5.1 పనులు జరుగుతున్నాయి.. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెన్సార్ కి ఇవ్వబోతున్నాం..ఇప్పటివరకు సినిమా చాల బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది.. త్వరలోనే ఆడియో తేదీ, విడుదల తేదీ ని వెల్లడిస్తాం.. అన్నారు..
నటీనటులు : కార్తీక్ ఆనంద్, మున్నా, డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె. ,వెణుగొపాల్ రావు, కొటేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం: కార్తీక్ ఆనంద్
నిర్మాత : ప్రశాంత్ తాత
సహా నిర్మాత : లలిత కుమారి బొడ్డుచర్ల
సంగీతం: నరేష్ కుమరన్
డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్
ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి
ఆర్ట్ : అవినాష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి
సాహిత్యం : రామాంజనేయులు
పి.ఆర్.ఓ : సాయి సతీష్..
The post Eureka Movie Begins Post Production Work appeared first on Social News XYZ.