అజయ్ "స్పెషల్" మూవీ ప్రీమియర్స్ కి అద్భుత స్పందన..... జూన్ 14న గ్రాండ్ రిలీజ్
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్. ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురికి ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోస్ కి అధ్బుతమైన స్పందన లభించింది. చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసించడం విశేషం. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ.... మా సినిమాకు పిల్లర్ అయిన అజయ్ గారికి చాలా చాలా థాంక్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 14న మా స్పెషల్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. స్పెషల్ సినిమా ఒక సోషియో ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్ లో వస్తున్నాయి. గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్ లో వచ్చిన సిక్స్త్ సెన్స్, మెకనిస్ట్, అన్ బ్రేకబుల్, సైకో వంటి మూవీస్ ని తలపించే స్టాండర్ట్స్ లో టేకింగ్ పరంగా ఈ మూవీ ఉంటుంది. గర్వంగా మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు గర్వపడుతారు. ఇతర భాషల వారికి చూపించుకోవచ్చు. సోషల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఎలిమెంట్ ఉంది. భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. సాలిడ్ ఇంపాక్ట్ ఉండే చిత్రం చేశాం. ఫిలిం మేకర్స్ గా సోషల్ రెస్పాన్సి బులిటీ ఉండేలా తీశాం. ఇటీవలే స్పెషల్ ప్రీయమిర్ షోస్ వేశాం. వీటికి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు.
బాపినీడు మాట్లాడుతూ.... స్పెషల్ సినిమా జూన్ 14న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది. క్షణం, గూఢచారి సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. హీరో సీనియర్ హీరోలా కనిపించాడు. మెయిన్ పిల్లర్ అజయ్ గారు. చాలా బాగా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చిన వాస్తవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అని అన్నారు.
చిత్ర నిర్మాత నందమ్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ.... స్పెషల్ సినిమా జున్ 14న రిలీజ్ కి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది ఇది ఒక అద్భుతమైన సినిమా అని అన్నారు. ఇంతటి ఆశ్చర్యం కలిగించే సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని పదే పదే మెచ్చుకుంటున్నారు. ఇది చిన్న సినిమా అయినా కొంతకాలం క్రితం వచ్చిన గజిని, సెవెంత్ సెన్స్, చంద్రముఖి, అపరిచితుడు లాంటి సినిమాలని గుర్తు చేసిందని మెచ్చుకున్నారు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ ని రీడ్ చేయడం చాలా అద్భుతంగా ఉందని.... అజయ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతని పెర్ఫార్మెన్స్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయనీ... మిగిలిన పాత్రలు పోషించిన చాలా మంది కొత్త వాళ్లయినా సినిమాలో ఫీల్ అద్భుతంగా ఉందని అన్నారు. ఇది తెలుగులో చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అని చూసిన వాళ్లందరూ మెచ్చుకోవడం విశేషం. ఈ సినిమాని చూసిన శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజు గారు ఇది గూఢచారి సినిమా కంటే 4రెట్లు బాగుందని చెప్పి పంపిణీ బాధ్యతలు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, టీజర్స్, ప్రోమో సాంగ్స్ తో ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన తెచ్చుకోవడం విశేషం. ఇంత చిన్న బడ్జెట్ లో ఇలాంటి సినిమా తీయగలగడం డైరెక్టర్ వాస్తవ్ ప్రతిభకు తార్కాణం. ఇతను ఫ్యూచర్ లో చాలా పెద్ద సినిమాలు తీయగలడని అందరు భావించడం సినిమా టీమ్ మొత్తానికి చాలా ఆనందం కలిగిస్తోంది. అని అన్నారు.
నటీనటులు
అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, జబర్దస్త్ అప్పారావ్, ప్రకాష్, మహేష్, చక్రపాణి, కమలేష్, వర్షిత్, బిహెచ్ఈఎల్ సునీల్, గౌతమ్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - నందలాల్ క్రియేషన్స్
నిర్మాత - నందమ్ శ్రీ వాస్తవ్
డైరెక్టర్ - వాస్తవ్
మ్యూజిక్ డైరెక్టర్ - ఎన్వీఎస్ మన్యం
ఫొటోగ్రఫీ - బి అమర్ కుమార్
ఎడిటింగ్ - ఎస్ బి ఉద్దవ్
ప్రొడక్షన్ కంట్రోలర్ - బిఎస్ నాగిరెడ్డి
కో డైరెక్టర్ - ప్రణీత్ వర్మ
సౌండ్ రికార్డింగ్ - సాగర్ స్టూడియోస్
సిజి అండ్ డీఐ - క్రిష్ణ ప్రసాద్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
The post Ajay’s Special Movie Premiere Gets Fantastic Response, Grand Release On June 14th appeared first on Social News XYZ.