*నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ.. ప్రభూ.. ఈ జన్మకూ..
అన్న ‘ఎన్. టి. ఆర్.’ 97వ జయంతి (28th May)
2020 - 98వ జయంతి
2021 - 99వ జయంతి
2022 - శత జయంతి
తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి..
కులం, మతం, ప్రాంతం మరియూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న..
‘అన్న’ ‘ఎన్. టి. ఆర్.’ ‘శత జయంతి’ ఉత్సవాలను ఘనంగా జరిపే ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించాలనీ..
ఆయన జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్. టి. ఆర్. జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ..
ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ..
ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతూ..
ఆయన వీరాభిమాని
‘బొమ్మరిల్లు వారి’ సంస్థ అధినేత
వై. వి. ఎస్. చౌదరి.*
The post YVS Chowdary On NTR’s 97th Birth Anniversary appeared first on Social News XYZ.