`సీత` ప్రీ రిలీజ్ ఫంక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోఆర్ఎక్స్100
భామ పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక గీతంలో నటించారు. మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్‌ను నేను లైఫ్‌లో ఇప్పటివరకు కలవలేదు. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ‘సీత’ సినిమాలో నేను చేసిన రఘురామ్ అనే పాత్ర ఛాలెంజింగ్ రోల్. సినిమా చూశాక నా క్యారెక్టర్‌కు తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమా నాకు ఒక యాక్టర్‌గా మంచి రెస్పెక్ట్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరో అంటే ఫస్ట్ కనిపించాలి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశాం. టైటిల్ రోల్ చేసిన కాజల్ చాలా కష్టపడ్డారు. సోనూసూద్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. మన్నారాచోప్రాతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా నటించారు. మా ప్రొడ్యూసర్ అనిల్‌గా మా అందరినీ మేనేజ్ చేసి చాలా బాగా చూసుకున్నారు. మా నాన్నగారి బ్యానర్ తర్వాత ఇంత పెద్ద బ్యానర్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. అనూప్ రుబెన్స్ గారు ఆర్ఆర్‌తో చాలా బాగా ఆకట్టుకున్నారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంది.’’ అన్నారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్ టైమ్ నేను నర్వస్ ఫీలవుతున్నా. సీత సినిమాతో చాలా నేర్చుకున్నా. ఇదొక బ్రిలియంట్ జర్నీ. సోనూసూద్ వండర్‌ఫుల్ కోస్టార్. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. తేజగారు నా గురు, నా మెంటర్, గైడ్. ఆయన లేకపోతే నేను ఈ స్టేజీపై ఉండేదాన్ని కాదు. తేజగారి స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నాను. సీత సినిమాతో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణ పడి ఉంటాను.’’ అన్నారు.
డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. ‘‘నాకు మట్లాడడం రాదు. మైక్ ఇచ్చినప్పుడల్లా బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతోంది. ఈ మధ్య చాలావాటికి బ్లాంక్ అయిపోతోంది. సినిమా ఎలా వచ్చిందని నిన్న బెంగళూరులో అడిగారు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. కానీ మాములుగా అందరూ ఏం చెప్తారు.. చాలా బాగా వచ్చింది.. సూపర్‌గా వచ్చిందని, కానీ అబద్ధం చెప్పలేం.. నిజమూ చెప్పలేం. ఎందుకంటే నిజంగా నాకు జడ్జిమెంట్ లేదు. సినిమా తీశా.. ఎక్కడ తప్పులున్నాయో అని వెతుకుతున్నా. 90శాతం బాగుంది. ఇప్పటికి కూడా సినిమా సూపరా? బాగుందా? ఏంటో మీరే చూసి చెప్పాలి. నేను సినిమా అంతా తీసేసి పరుచూసి బ్రదర్స్‌ను పిలిచి చూడమన్నాను. వాళ్లు చెప్పిన కరెక్షన్స్‌తో మళ్లీ షూట్ చేసి అంతా సరిచేశా. ఎందుకంటే నాది అంత ఇంటలిజెంట్ బ్రెయిన్ ఏం కాదు.. కళ్లజోడు పెట్టుకుని ఏదో అలా కనిపిస్తా కానీ, యావరేజ్ బ్రెయిన్ నాది. చూసేవాళ్లు ఏమనుకుంటారంటే..కళ్లజోడు చూడగానే మేధావని అనుకుంటారు. కళ్లజోడు పెట్టుకున్నవాళ్లంతా మేధావులు కాదు.. కొంతమందే మేధావులుంటారు. ఈ సినిమాలో హీరో చాలా బాగా చేశాడు. హీరో యాక్షన్, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ బాగా చేస్తాడు. మీరు రెగ్యులర్‌గా చూసే ఆ కమర్షియల్ స్టయిల్ నాకు చేతకాదు. వేరే స్టయిల్‌లో చూపించాను. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. హీరోయిన్ కాజల్ కూడా చాలా బాగా చేసింది. సోనూ సూద్ గారు నేను అనుకున్నదాని కంటే చాలా బాగా చేశారు. అనూప్ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా చేశాడు. వీళ్లందిరికీ నేను గ్రేడింగ్ ఇవ్వగలనేమో కానీ, నా గ్రేడింగ్ మాత్రం మీరే ఇవ్వగలరు. ఈ నెల 24న సినిమా చూసి మీరే గ్రేడింగ్ ఇవ్వండి. నన్ను తిట్టినా, పొగిడినా దాన్ని సినిమాలో పెట్టేస్తా. ఎందుకంటే నాకు సినిమా తప్ప ఇంకొకటి రాదు. హిట్లు తీసినా, ఫ్లాపులు తీసినా ఇక్కడే. ఆడియెన్సే మాకు దేవుళ్లు. మీరంతా బాగుండాలి.’’ అన్నారు.
సోనూ సూద్ మాట్లాడుతూ..‘‘ఇటీవల ఒక ఫంక్షన్‌లో నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కదా.. మీ ఫెవరెట్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగారు. నేను వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది తెలుగు లాంగ్వేజే. తెలుగు ఇండస్ట్రీ నా ఫేవరెట్ ఇండస్ట్రీ. ఇక్కడున్న టెక్నీషియన్స్ ఎంతో ప్రేమగా చూస్తారు. నా డేట్స్ ఖాళీ లేకపోయినా నా కోసం నెలరోజులు వెయిట్ చేసి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజగారికి ధన్యవాదాలు.’’ అన్నారు.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్
కాజల్ అగర్వాల్
మన్నారా చోప్రా
సోనూ సూద్
తనికెళ్ల భరణి
అభినవ్ గోమటం
అభిమన్యుసింగ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్
సమర్పణ: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రపీ: శిర్షా రే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: కనల్ కణ్ణన్
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
పబ్లిసిటీ ఇన్‌చార్జ్: విశ్వ సి.ఎం
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్
The post Sita movie pre-release event held appeared first on Social News XYZ.