Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

Ajay’s “Special -The Story of a Mind Reader” movie to release on June 7th

$
0
0

జూన్ 7న అజయ్ "స్పెషల్" - ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ గ్రాండ్ రిలీజ్

Ajay's "Special -The Story of a Mind Reader" movie to release on June 7th

Ajay’s “Special -The Story of a Mind Reader” movie to release on June 7th (Photo:SocialNews.XYZ)

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్. ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో

చిత్ర దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ.... ముందుగా మీడియాకు స్పెషల్ థాంక్స్. మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. బాపినీడు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మా సినిమాకు పిల్లర్ అయిన అజయ్ గారికి చాలా చాలా థాంక్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 7న మా స్పెషల్ సినిమా రిలీజ్ చేస్తున్నాం.  స్పెషల్ సినిమా ఒక సోషియో ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్ లో వస్తున్నాయి. గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్ లో వచ్చిన సిక్స్త్ సెన్స్, మెకనిస్ట్, అన్ బ్రేకబుల్, సైకో వంటి మూవీస్ ని తలపించే స్టాండర్ట్స్ లో టేకింగ్ పరంగా ఈ మూవీ ఉంటుంది. గర్వంగా మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా తెలుగులో వస్తున్నందుకు గర్వపడుతారు. ఇతర భాషల వారికి చూపించుకోవచ్చు. సోషల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబులిటీ ఎలిమెంట్ ఉంది. భారతదేశం మొత్తం సఫర్ అవుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. సాలిడ్ ఇంపాక్ట్ ఉండే చిత్రం చేశాం. ఫిలిం మేకర్స్ గా సోషల్ రెస్పాన్సి బులిటీ ఉండేలా తీస్తున్నాం. మేం గత ఇరవై రోజులుగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నాం. చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమాలు యూత్ ని చెడగొడుతున్నాయి. వీటికి ఆద్యులు మాత్రం ఆర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ హండ్రెడ్ సినిమాలే. ఈ రెండు సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. మేం ఫైట్ చేస్తే ఇవి ఆగిపోతాయని కాదు.

రాబోయే నెలరోజులు ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు మోడ్రన్ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన.. వర్మ జిఎస్టీ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. ఎంతో మంది డైరెక్టర్స్ అయ్యేందుకు దోహదపడ్డ వర్మ మీద కూడా ఫైట్ చేస్తాం. ఏది పడితే అది వాగుతా.. ఏది పడితే అది తీస్తా... అంటే ఆయన అసలైన అభిమానులుగా ఒప్పుకోం. ఇక తెలుగులో సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న సినిమాలు తీసిన ఏకైక డైరెక్టర్ కృష్ణవంశీ గారు. లెజెండ్ చిరంజీవి గారు. ఈరోజున గొప్ప సినిమాలు తీస్తున్నారు. వందేమాతరం అనే సినిమా చేయాలని కృష్ణవంశీ గారు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మీరు కూడా చేద్దామని మాట ఇచ్చారు. ఆయకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాలాంటి నిజమైన సినిమా అభిమానులందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన హిట్టిస్తాడో లేదో అని భయపడతున్నారా సర్.. ఇప్పుడు మీకు హిట్ అనేది అవసరం లేదు. కృష్ణవంశీ గారికి అవకాశం ఇచ్చి చూడండి. హిట్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు. అని అన్నారు.

బాపినీడు మాట్లాడుతూ.... స్పెషల్ సినిమా జూన్ ఏడున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా అత్యంత అద్భుతంగా ఉంది. క్షణం, గూఢచారి సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. హీరో సీనియర్ హీరోలా కనిపించాడు. మెయిన్ పిల్లర్ అజయ్ గారు. చాలా బాగా చేశారు. ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చిన వాస్తవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అని అన్నారు.

నటీనటులు

అజయ్, రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్, బిహెచ్ఈఎల్ ప్రసాద్, జబర్దస్త్ అప్పారావ్, ప్రకాష్, మహేష్, చక్రపాణి, కమలేష్, వర్షిత్, బిహెచ్ఈఎల్ సునీల్, గౌతమ్ తదితరులు

సాంకేతిక వర్గం

బ్యానర్ - నందలాల్ క్రియేషన్స్

నిర్మాత - నందమ్ శ్రీ వాస్తవ్

డైరెక్టర్ - వాస్తవ్

మ్యూజిక్ డైరెక్టర్ - ఎన్వీఎస్ మన్యం

ఫొటోగ్రఫీ - బి అమర్ కుమార్

ఎడిటింగ్ - ఎస్ బి ఉద్దవ్

ప్రొడక్షన్ కంట్రోలర్ - బిఎస్ నాగిరెడ్డి

కో డైరెక్టర్ - ప్రణీత్ వర్మ

సౌండ్ రికార్డింగ్ - సాగర్ స్టూడియోస్

సిజి అండ్ డీఐ - క్రిష్ణ ప్రసాద్

పిఆర్ఓ - ఏలూరు శ్రీను

The post Ajay’s “Special -The Story of a Mind Reader” movie to release on June 7th appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles