Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94496

Entha Vaaralainaa Trailer is good, Movie will be a hit: Producer Atchi Reddy

$
0
0

ఎంతవారలైనా' ఆడియో, ట్రైలర్‌ చాలా బాగుంది.. సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది
- నిర్మాత కె.అచ్చిరెడ్డి

Entha Vaaralainaa Trailer is good, Movie will be a hit: Producer Atchi Reddy

Entha Vaaralainaa Trailer is good, Movie will be a hit: Producer Atchi Reddy (Photo:SocialNews.XYZ)

సంహిత, చిన్ని - చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నటిస్తూ.. నిర్మిస్తున్న న్యూ జనరేషన్‌ హారర్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'. ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, సీనియర్‌ నటి, నిర్మాత, దర్శకురాలు శ్రీమతి జీవితా రాజశేఖర్‌, వరుస హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి, దర్శకుడు మదన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యి బిగ్‌ ఆడియో సీడిని ఆవిష్కరించారు. శ్రీమతి జీవితా రాజశేఖర్‌ ఆడియో సీడిని విడుదల చేసి నిర్మాత కె.అచ్చిరెడ్డికి అందజేశారు.

ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''ఎంతవారలైనా' అనే ఒక మంచి టైటిల్‌తో వస్తున్న నిర్మాత సీతారెడ్డిగారు తన మిత్రుడైన డైరెక్టర్‌ గురు చిందేపల్లి గారి మీద నమ్మకంతో మొదటి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈరోజే సెన్సార్‌ పూర్తయ్యింది. సెన్సార్‌ సభ్యులు కూడా మంచి సినిమా తీశారు అని అభినందించారని సీతారెడ్డిగారు చెప్పడం జరిగింది. ఏ నిర్మాతకైనా తాను నమ్ముకున్న దర్శకుడు తను నమ్మిన చిత్రాన్ని తీసినప్పుడు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. అలాగే ఆ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చి సూపర్‌ హిట్‌ అయితే అదే నిజమైన ఆనందం. అందరూ మ్యూజిక్‌ చాలా బాగుంది అని చెప్పారు. అలాగే ఆదిత్య మ్యూజిక్‌కి సంబంధించిన మాధవ్‌, నిర్వీద్‌గారు కూడా మంచి మ్యూజిక్‌, సాంగ్స్‌ అన్ని కూడా చాలా బాగున్నాయి అని కన్ఫర్మ్‌ చేశారు. ఈ ఫంక్షన్‌ హీరో అయినా సుక్కుగారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ట్రైలర్‌ చాలా బాగుంది. చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది'' అన్నారు.

శ్రీమతి జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''ప్రొడ్యూసర్‌ జి. సీతా రెడ్డిగారి భార్య లక్ష్మిగారిని నేను ఎలక్షన్‌ క్యాంపైన్‌కి వెళ్ళినప్పుడు కలిసి చాలా సేపు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మంచి భోజనం పెట్టి చాలా బాగా ట్రీట్‌ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను నిర్మించింది ఆమె భర్త సీతారెడ్డిగారు అనగానే ఈ ఫంక్షన్‌కి రావడం జరిగింది. 'ఎంతవారలైనా' టీం అందరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

వరుస హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''ఈ చిత్ర నిర్మాత జి. సీతారెడ్డిగారికి, దర్శకుడు గురు చిందేపల్లి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు కి, 'ఎంతవారలైనా' టీమ్‌ అందరికి నా అభినందనలు. ఆడియో చాలా బాగుంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.

దర్శకుడు మదన్‌ మాట్లాడుతూ - ''ఎంతవారలైనా' ట్రైలర్‌ చూస్తుంటే మంచి థ్రిల్లర్‌లా కనబడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కంటెంట్‌ వైవిధ్యంగా ఉంది. బాగా ప్రజెంట్‌ చేయగలిగితే సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. ఇలాంటి థ్రిల్లర్‌ సినిమాలకు మార్కెట్‌ స్కోప్‌ కూడా చాలా బాగుంది. ఒక వ్యాపార వేత్త అయినా జి. సీతారెడ్డిగారు చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చి ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న ఔత్సాహిక ప్రొడ్యూసర్స్‌కి ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. టీం అందరికి అల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

చిత్ర నిర్మాత జి. సీతారెడ్డి మాట్లాడుతూ - ''ఫస్ట్‌ సినిమా అంటే ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ.. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ మంచి సహకారాన్ని అందించారు. సుక్కు అయితే ఈ సినిమాకి అల్టిమేట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆర్‌.ఆర్‌, సాంగ్స్‌ చాలా బాగున్నాయి. ఈ సినిమా గురించి ఇంకో మీట్‌ లో మరింత మాట్లాడాలి అనుకుంటున్నాను. అదే సక్సెస్‌ మీట్‌'' అన్నారు.

చిత్ర దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ - ''ప్రొడ్యూసర్‌ జి. సీతారెడ్డిగారు నన్ను నమ్మి ఈ కథను చాలా ఇష్టపడి చేశారు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు, డిఓపి మోహన్‌ రెడ్డి మంచి సహకారాన్ని అందించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నీషియన్స్‌కి నాకృతజ్ఞతలు. ఈ సినిమా 'ఎంతవారలైనా' శిక్షార్హులే అనే నేపథ్యంలో సాగుతుంది'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు మాట్లాడుతూ - ''ముందుగా ఆదిత్య మ్యూజిక్‌ గురించి చెప్పాలి. సాంగ్స్‌ వినగానే చాలా బాగున్నాయి.. కచ్చితంగా తీసుకుంటాం అని ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే మా ప్రొడ్యూసర్‌ జి. సీతారెడ్డిగారు సినిమా తీస్తా అని ఒక మాట ఇచ్చినందుకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి మా వరకు రానీకుండా మంచి కమిట్‌మెంట్‌తో సినిమా నిర్మించారు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక సాంగ్స్‌ గురించి నేను చెప్పడంకన్నా పాటలు విని మీరు చెప్తేనే బాగుంటుంది'' అన్నారు.

హీరో అద్వైత్‌ మాట్లాడుతూ - ''తెలుగులో నా మొదటి సినిమా. ఎంత టాలెంట్‌ ఉన్నా ఒక ఆర్టిస్ట్‌కి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు గురుచిందేపల్లిగారికి నా ధన్యవాదాలు. ఒక మూవీ స్టార్ట్‌ అయ్యి ఇంత తొందరగా రిలీజ్‌కి రావడం నా కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌. అందుకు జి. సీతారెడ్డిగారే కారణం. ఆయన ఈ సినిమాను నిర్మించడం మా టీమ్‌ అందరి అదృష్టం'' అన్నారు.

నటుడు అలోక్‌ జైన్‌ మాట్లాడుతూ - ''మా టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశాం. మేమంతా మంచి జోష్‌తో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్‌ కావాలి'' అన్నారు.

హీరోయిన్‌ జహిదా సామ్‌ మాట్లాడుతూ - ''మా టీం అందరికి ఇది ఒక స్పెషల్‌ మూమెంట్‌. మా సినిమాను ఎంకరేజ్‌ చేయడానికి వచ్చిన మీడియావారికి థాంక్స్‌. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత జి. సీతారెడ్డిగారికి, దర్శకుడు గురు చిందేపల్లిగారికి ధన్యవాదాలు'' అన్నారు.

'ఎంతవారలైనా' చిత్ర నిర్మాత జి. సీతారెడ్డి ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అలీషా, అభిలాష్‌, మాస్టర్‌ అయాన్‌, డిఓపి మురళీమోహన్‌ రెడ్డి, బందన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ విక్రమ్‌ అండ్‌ టీమ్‌ పాల్గొని 'ఎంతవారలైనా' చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి. సీతారెడ్డి, స్వప్న, అలీషా, అభిలాష్‌, మాస్టర్‌ అయాన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: సుక్కు, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: బాబ్జీ, స్టిల్స్‌: ఈశ్వర్‌, నిర్మాత: జి. సీతారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గురు చిందేపల్లి.

The post Entha Vaaralainaa Trailer is good, Movie will be a hit: Producer Atchi Reddy appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94496

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>