Quantcast
Channel: Actresses Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 95785

A love story with village backdrop movie Gurtukostunnayi launched

$
0
0

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ 'గుర్తుకొస్తున్నాయి' చిత్రం ప్రారంభం..

A love story with village backdrop movie Gurtukostunnayi launched

A love story with village backdrop movie Gurtukostunnayi launched (Photo:SocialNews.XYZ)

నూతన నటుడు ఉదయ్ హీరోగా ట్వింకిల్ అగర్వాల్ హీరోయిన్ గా యు ఆర్ క్రియేషన్స్ పతాకంపై రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ గుర్తుకొస్తున్నాయి. 1980 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ ప్రేమకథ ఇది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏప్రిల్ 22 న హైదరాబాద్ శ్రీ సత్యసాయినిగాగమం వేంకటేశ్వరస్వామి దైవ సన్నిధానంలో వైభవంగా ప్రారంభమైంది. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఉదయ్ హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాయి వెంకట్ క్లాప్ నివ్వగా వ్యాపారవేత్త శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఉదయ్, హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్, దర్శకుడు రాజేష్, సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్, సహా నిర్మాత ముత్యాల దుర్గాప్రసాద్, నిర్మాత బంగార్రాజు కెమెరామెన్ శివ పాల్గొన్నారు.

హీరో ఉదయ్ మాట్లాడుతూ.. మా దర్శకుడు రాజేష్ స్టోరీ చెప్పగానే స్పెల్ బౌండ్ అయ్యాను. నేను అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అవి చూసి నిర్మాత బంగార్రాజు హీరో నువ్వే అనేసరికి షాక్ అయ్యాను. ఈ చిత్రంలో స్కూల్ బోయ్ గా నటిస్తున్నాను. టీనేజ్ లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది.. అన్నారు.

హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిలిం. ఆడిషన్స్ చేసి నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా థాంక్స్ అన్నారు.

దర్శకుడు రాజేష్ సి.హెచ్ మాట్లాడుతూ.. చాలా సినిమాలకు నేను దర్శకత్వ శాఖలో పనిచేసాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. 1980 గ్రామీణ నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. స్కూల్ డేస్ లో పిల్లలు ఎలా ఉండేవారు. అప్పట్లో ఆటలు ఎలా ఉండేవి. ఆ పిల్లలు మధ్య ప్రేమ ఎలా చిగురించేది. అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారి తీపి జ్ఞ్యాపకాలు గుర్తుకు వచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.

నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వుంటూ సినిమాలను అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పటినుంచో ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైములో రాజేష్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథకి మా బ్రదర్ ఉదయ్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అనిపించి హీరోగా లాంచ్ చేస్తున్నాం. పల్లెటూరి వాతావరణంలో జెరిగే స్వచ్ఛమైన, అందమైన లవ్ స్టోరీ ఇది. మే 1నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం అన్నారు.

సహా నిర్మాత ముత్యాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. కంస్ట్రక్షన్స్ బిజినెస్ లో వున్న నేను దేనికి డిస్టర్బ్ అవును. కానీ రాజేష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి చాలా డిస్టర్బ్ అయ్యాను. మనం చదువుకున్న రోజులు గుర్తుకు తెచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. అద్భుతమైన పాటలు మార్క్ ప్రశాంత్ కంపోజ్ చేసారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది..అన్నారు.

సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్ మాట్లాడుతూ... మూడు పాటలు రికార్డింగ్ పూర్తి అయ్యాయి. మిగతా పాటలు చేస్తున్నాం. కథకి యాప్ట్ అయ్యేలా పాటలు ఉంటాయి. ఈ సినిమా చేస్తుండగానే మరో రెండు సినిమాలు ఆఫర్ వచ్చాయి. మా టీమ్ అంతా ఎంతో ఇన్స్పైర్ అయి ఈ సినిమా చేస్తున్నాం.. అన్నారు.

ఉదయ్, ట్వింకిల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బాబీ, పవన్ కుమార్, రఘు, రోజా చంద్రమౌళిలతో పాటు ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా; శివ.కె, సంగీతం; మార్క్ ప్రశాంత్, కో-డైరెక్టర్; రామకృష్ణ ఈనాడు, కాస్ట్యూమ్స్; నాగరాజు, మేకప్; రాజ్ కమల్, సహా నిర్మాతలు; ముత్యాల దుర్గా ప్రసాద్, జివివి సత్యనారాయణ, నిర్మాత; బంగార్రాజు, కథ-మాటలు-స్క్రీన్ ప్లై-దర్శకత్వం; రాజేష్ సి.హెచ్.

The post A love story with village backdrop movie Gurtukostunnayi launched appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 95785

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>