తుది మెరుగుల్లో సునిల్ కుమార్ రె్డ్డి "రొమాంటిక్ క్రిమినల్స్"

Sunil Kumar Reddy’s Romantic Criminals movie in the final stages of production (Photo:SocialNews.XYZ)
ఈ సందర్బంగా నిర్మాతల్లో ఓకరైన బి.బాపిరాజు మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మిపిక్చర్స్, శ్యావ్యాఫిలింస్ బ్యానర్ లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో గతంలో విడుదలయిన ఓక రోమాంటిక్ క్రైమ్ కథ, ఓక క్రిమినల్ ప్రేమకథ తరహలో సీక్వెల్ గా రోమాంటిక్ క్రిమినల్స్ తెరకెక్కించాము. ఈ సినిమా పూర్తిగా నవ్యాంద్రలో స్మార్ట్‌సిటి గా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటి విశాఖపట్నం లో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆశక్తికరంగా తీర్చిదిద్దాము.. ఈ చిత్రం గత రెండు చిత్రాలకంటే ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజి స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథ లో హీరోగా మనోజ్ నందన్, విలన్ గా వినోద్ , హీరోయిన్స్ అవంతిక, దివ్య, మౌనిక లు చాలా చక్కటి నటన కనబర్చారు. ఏజేన్సి ఎరియాలో గంజాయ్ తోటలో పోలీసుల భద్రత మద్య ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. వ్యసనాలు ఏమైనా వాటి పర్యవససానాలు వినాశకారకంగా వుంటాయనే పాయింట్ ని వినోదం పాళ్ళు తగ్గించకుండా మా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది అని అన్నారు
దర్శకుడు పి.సునిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా రోమాంటిక్ క్రిమినల్స్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. నటీనటులు కూడా చాలా చక్కగా పాత్రలో పరకాయప్రవేశం చేసి మరీ నటించారు. ముందు రెండు చిత్రాన్ని మించి వినోదం తో పాటు చక్కటి మెసెజ్ వుంటుంది. ఈ చిత్రానికి ఎస్.వి. శివరామ్ సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అవుతుంది, విశాఖ , అరకు లో ని అందాలే కాకుండా గంజాయ్ తోటల్లో పోలీసుల దాడి చేసే సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించాము. శామ్యూల్ కళ్యాణ్ ఎడిటింగ్ సినిమా ఫేస్ ని పెంచేలా వుంది. సుదాకర్ మారియో సంగీతం సారథ్యంలో నాలుగు పాటలు చాలా చక్కగా కుదిరాయి. త్వరలో ప్రముఖ ఆడియో సంస్థ ద్వారా ఆడియో ని విడుదల చేస్తాము. మే నేలలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు
అని అన్నారు.
నటీనటులు... మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక , ఎఫ్.ఎమ్ బాబాయ్, బుగతా, సముద్రమ్ వెంకటేష్ తదితరులు..
సాంకేతిక వర్గం..
పాటలు ..బాల వర్దన్
సంగీతం.. సుధాకర్ మారోయో
కెమెరా.. ఎస్.వి. శివరామ్
ఎడిటింగ్.. శామ్యుల్ కళ్యాణ్
పి అర్ ఓ .. ఏలూరు శ్రీను
, సహనిర్మాతలు.. వైద్యశ్రీ డాక్టర్ ఎల్ ఎన్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్,
నిర్మాతలు.. ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు,
కథ,మాటలు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.... పి.సునీల్ కుమార్ రెడ్డి
The post Sunil Kumar Reddy’s Romantic Criminals movie in the final stages of production appeared first on Social News XYZ.