జూన్ 7న విడుదలకు సిద్ధమవుతున్న `హిప్పి`


'ఆర్‌ఎక్స్100' ఫేమ్ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంటగా కలైపులి ఎస్. థాను సమర్పణలో వి. క్రియేషన్స్ పతాకంపై టిఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్ 'హిప్పీ`. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``మా హిప్పీ
జూన్ 7న విడుదల కానుంది. షూటింగ్ చాలా బాగా జరిగింది. ఔట్‌పుట్ అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్ స్టోరి ఉంటుంది. మరో వైపు ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు దర్శకుడు. 'కబాలివంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్. థానుగారి సంస్థలో
హిప్పీ` చేయడం గొప్పగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బడ్జెట్ చిత్రంలా చేశారు. సినిమా చేస్తున్నప్పుడే పాజిటివ్ ఫీలింగ్‌తో చేశాం. జె.డి. చక్రవర్తిగారిది చాలా చాలా కీ రోల్. ఆయన కథ వినగానే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్. అందరినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది'' అన్నారు.
నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ - ``కథ వినగానే నచ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంటనే ఓకే చెప్పేశాను. కార్తికేయను ఆర్.ఎక్స్ 100
లో చూశా. కార్తికేయ రొమాన్స్, ఫైట్స్, డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీ
వంటి కథ కుదరడం గ్రేట్. మంచి మనసున్న కలైపులి థానుగారి బ్యానర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.
దర్శకుడు టిఎన్. కృష్ణ మాట్లాడుతూ - ``సినిమా చాలా సహజంగా, సింపుల్‌గా ఉంటుంది. మన కుటుంబంలోనో, మన స్నేహితుల జీవితాల్లోనో జరుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రతి సీన్ లోనూ వినోదం ఉంటుంది. కార్తికేయకు యాప్ట్ సబ్జెక్ట్ ఇది. కథ వినగానే థానుగారు ఓకే చెప్పారు. దిగంగన పాత్ర కూడా చాలా బావుంటుంది. ఎంతో మందికి కనెక్ట్ అవుతుంది. జె.డి. చక్రవర్తిగారిది క్రూషియల్ రోల్. లవబుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ సినిమా అవుతుంది. యూనిట్ సభ్యుల సహకారంతో వేగంగా షూటింగ్ పూర్తి చేశాం. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి'' అన్నారు.
నిర్మాత కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ - '' ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చే కథతో హిప్పీ
ని తెరకక్కించడం నాకు ఆనందం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఔట్ స్టాండింగ్ స్క్రిప్ట్ ఇది. అన్ని వర్గాల వారికీ కావాల్సిన అంశాలున్నాయి. జె.డి. చక్రవర్తి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిత్రంలో ఆయన కేరక్టర్ హైలైట్ అవుతుంది. నాటి మేటి హీరోయిన్లు పలువురి సరసన నిలవదగ్గ నటి దిగంగన. మా హిప్పీ
విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్ హీరోగా నిలబడతారు. ఆర్‌డి రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం'' అన్నారు.
నటీనటులు
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్
The post Hippi movie to release on June 7th appeared first on Social News XYZ.