ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని రాఘవ లారెన్స్ మాసివ్ పెర్ఫార్మెన్స్ "కాంచన-3" లో చూస్తారు
------ బి. మధు


ముని, కాంచన, కాంచన-2 తో హార్రర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ సక్సెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘవ లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వం లో ముని సిరీస్ నుంచి వస్తున్న హార్రర్ కామెడీ చిత్రం కాంచన-3. రాఘవ లారెన్స్ అందించిన హార్రర్ చిత్రాలన్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బస్టర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసినవే. అన్నిటిని మించి ఈ కాంచన-3 మాత్రం లారెన్స్ కి స్పెషల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U /A సర్టిఫికెట్ తో సెన్సార్ సభ్యులని థ్రిల్ చేసింది . ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ తో ఒక మాసివ్ వేవ్ ని తీసుకొచ్చింది.. అదే విధంగా రిలీజ్ చేసిన సాంగ్ లో లారెన్స్ డాన్స్ కి చాలా మంచి క్రేజ్ రావటం విశేషం . తెలుగు , తమిళ్ ప్రేక్షకులకి రాఘవ లారెన్స్ ఏం చేసినా స్పెషల్ గా, సెన్సేషన్ గా ఉంటుంది. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మధు విడుదల చేయనున్నారు. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాఘవ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా బి . మధు మాట్లాడుతూ .... కాంచన సినిమా చూసిన ప్రతి ప్రెకషకుడు ఫ్యాన్ అయిపోయారు . ఆ తరువాత వచ్చిన ప్రతి పార్టు కి ప్రెకషకులు నీరాజనాలు పలికారు . లారెన్స్ తీసుకునే మంచి పాయింట్ కచ్చితం గా హార్ట్ టచింగ్ గా ఉండటం అందరిని ఆకట్టుకుంటుంది. దివ్యంగుల సమస్యని.. థర్డ్ జెండర్ సమస్యల్ని సున్నితంగా హారర్ కామెడీ లో చెప్పిన ఏకైక దర్శకుడు లారెన్స్ మాత్రమే .. అంతే కాకుండా ఆయన హీరో గా తన నట విశ్వరూపం తో ప్రెకషకులని విపరీతం గా ఆకట్టుకొని బ్లాక్బూస్టర్స్ కొట్టారు.. ఇండియన్ హిస్టరీ లో 4 [పార్టీలు తీసిన సినిమా ఇది ఒక్కటే అలాగే ఇంకో 10 పార్ట్ లు తీస్తానని లారెన్స్ చెప్పటం విశేషం... ఇప్పుడు ఆయన నటించి దర్శకత్వం చేసిన కాంచన 3 చిత్రం తన కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు . కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మించిన కథా బలంతో వస్తున్నాడు అలాగే మంచి సుర్ప్రిసె తో థ్రిల్ చేయనున్నాడు .. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశారు . ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు . ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో లారెన్స్ గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. ఆయన లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నారు. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి ఆశ్చర్యాయానికి గురి కావటమే కాకుండా.. థ్రిల్ ఫీల్ అయ్యారు .. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు.. మా బ్యానర్ లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుంది అని నా గట్టి నమ్మకం... మాస్ కమర్షియల్ చిత్రాలు తీయటం లో సిద్ధహస్తుడు మన లారెన్స్ మరొక్కసారి తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా మా కంచన అన్ని వర్గాల ఆకట్టుకుంటుంది. అన్నారు .
The post You will see a different Raghava Lawrence in Kanchana 3: B Madhu appeared first on Social News XYZ.