Quantcast
Channel: South Cinema Archives - Social News XYZ
Viewing all articles
Browse latest Browse all 94779

I have felt satisfied as an actor after a long time: Naga Chaitanya

$
0
0

చాలా రోజుల తరువాత నటుడిగా గొప్ప సంతృప్తి కలిగింది- థాంక్స్ మీట్ లో యువ సామ్రాట్ నాగచైతన్య

I have felt  satisfied as an actor after a long time: Naga Chaitanya

I have felt satisfied as an actor after a long time: Naga Chaitanya (Photo:SocialNews.XYZ)

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఆడియెన్స్ కి థాంక్స్ తెలపడానికి థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రంలో హీరో నాగచైతన్య, హీరోయిన్స్ సమంత, దివ్యాంశ, దర్శకుడు శివ నిర్వాణ, నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు.

పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. చైతన్య చిన్నప్పటినుండి తెలుసు. అతనితో రెండు సినిమాల్లో యాక్ట్ చేశాను. సెట్లో కామ్ గా ఉంటాడు. స్లో పాయిజన్లా సినిమా పికప్ అవుతుంది. ఈ సినిమా చూశాక చైతు ఇంత గొప్పగా నటిస్తాడా.. అని జెలసీ ఈర్ష్య కలిగింది. శోభన్ బాబు చైతు రూపంలో బ్రతికివచ్చాడా అనిపించింది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించాడు. మంచి డైరెక్టర్స్ చేతిలో పడక సరైన క్యారెక్టర్స్ చైతూకి రాలేదు. చైతు చాలా మంచివాడు. అతనిలో కూడా గొప్ప నటుడు వున్నాడని తెలుసుకున్నాను. తనకి మంచి క్యారెక్టర్స్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. రాఘవేంద్రరావు గారు రిటైడ్ అయ్యారు. ఆయన ప్లేస్లోకి శివ వచ్చాడు. ఫామిలీ ఎంటర్టైనెర్స్ ని ఇలా కూడా తీయవచ్చా అని నిరూపించాడు. శివ ఇలాంటి సినిమాలు మరిన్ని తియ్యాలి... అన్నారు.

రావు రమేష్ మాట్లాడుతూ.. ఒక మంచి క్యారెక్టర్ ని ఇచ్చిన శివకి థాంక్స్. నాగచైతన్య సెట్లో చాలా కూల్ గా వుంటూ అద్భుతంగా నటించాడు. సమంత సెకండాఫ్ లో వచ్చి సూపర్బ్ గా చేసింది. అలాగే దివ్యాంశ వండర్ ఫుల్ గా నటించింది. మిడిల్ క్లాస్ లో వుండే పెయిన్ ని కమర్షియల్ యాస్పెక్ట్ లో శివ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్, ఒక రిఫరెన్స్ అవుతుంది ఈ సినిమా. థియేటర్లో మా ఆవిడ క్లైమాక్స్ లో సన్నివేశాలకి కన్నీళ్లు పెట్టుకుంది. అంతలా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.. అన్నారు.

సాహు గారపాటి మాట్లాడుతూ.. మజిలీ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియెన్స్ కి థాంక్స్. చాలా హ్యాపీగా వుంది. చైతు సమంత, దివ్యాంశ, పోసాని, రావు రమేష్ మెయిన్ పిల్లర్స్ లా నిలబడి సినిమాకి హెల్ప్ చేసారు. శివ బాగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా సినిమని రూపొందించాడు. ఇంకా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మిస్తాం.. అన్నారు.

హీరోయిన్ దివ్యాంశ మట్కాడుతూ.. నిన్న బొంబాయిలో నిన్న ఈ సినిమా చూసాను. ధియేటర్ హౌస్ ఫుల్ అయింది. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంత మంచి హిట్ సినిమాలో నేను వన్ పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన సాహు, హరీష్, శివకి నా థాంక్స్.. అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ తర్వాత డిఫరెంట్ మనుషులు కాల్స్, మెస్సెజ్ లు చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్ నుండి ట్రైలర్ రిలీజ్ దాకా మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అప్పుడే మజిలీ సక్సెస్ స్టార్ట్ అయింది. ఒక ఎమోషనల్ స్టోరీని నేను ఎలాగైతే ఫీలయి తీశానో ఇవాళ ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతున్నారు. మంచి సినిమా కమర్షియల్ ఫార్మేట్ లో తియ్యాలి అంటే ఛాలెంజింగ్ గా అనిపించింది. డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేస్తున్నారు. సినిమా పెద్ద హిట్ అని చెపుతున్నారు. వారందరికీ థాంక్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో నా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. .. అన్నారు.

సమంత మాట్లాడుతూ.. సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమా చూసి నమ్మకంగా వున్నాం. కానీ ఇంత రెస్పాన్స్ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు. ఒక మంచి రిజల్ట్ ఆర్టిస్టుకి ఎంత ముఖ్యమో నాకు తెల్సు. సినిమా చూసి నాగ్ మామ ఇంటికి వచ్చారు. అప్ప్రీషియేట్ చేసారు. ఏమాయ చేసావే తరువాత మోస్ట్ స్పెషల్ ఫిలిం మాకు. రావు రమేష్, పోసాని ఎక్స్ట్రా లేయర్స్ వారు నటించారు. విష్ణు ఈ స్టోరీని తన ఫోటోగ్రఫీలో చెప్పేశారు. గోపి సుందర్, థమన్ ప్రాణం పెట్టి చేసారు. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.. అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. శివ కథ చెప్పగానే నేను ఎంత ఎక్సయిట్ గా ఫీలయ్యానో ఇవాళ ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతున్నారు. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక యాక్టర్ గా శాటిస్ ఫ్యాక్షన్ కలిగింది. శివతో సినిమాలు చేస్తే గొప్ప నటుడిగా చూపిస్తాడు అనే నమ్మకమ్ కలిగింది. రావు రమేష్, పోసాని గారు బాగా ఎంటర్టైన్ చేసారు. సాహు, హరీష్ ఫ్రెండ్స్ లా కథని నమ్మి సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. ఇంకా మరిన్ని సినిమాలు వారితో చెయ్యాలని కోరుకుంటున్నాను. థమన్, గోపిసుందర్, విష్ణు అందరికీ థాంక్స్. మజిలీ ఒక ఎమోషనల్ జెర్నీ.. అన్నారు.

The post I have felt satisfied as an actor after a long time: Naga Chaitanya appeared first on Social News XYZ.


Viewing all articles
Browse latest Browse all 94779

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>